పవన్ కళ్యాణ్ సినిమా కోసం స్వయంగా డబ్బింగ్

Keerti suresh
Keerti suresh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 25 వ చిత్రం ఆఖరి దశ షూటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ సరసన నటిస్తున్న హీరోయిన్లలో స్టార్ నటి కీర్తి సురేష్ కూడా ఒకరు. తెలుగులో ఈమె చేస్తున్న మొదటి భారీ ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. అందుకే ఆమె ఈ సినిమా కోసం స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఇప్పటికే డబ్బింగ్ మొదలుపట్టేశారామె. ఇకపోతే ఈ చిత్రం యొక్క టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రేపు ఉదయం విడుదలకానున్నాయి. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమిళ సంగీతం దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే నెలలో ఈ చిత్రం ఆడియో విడుదల జరుపుకుని 2018 జనవరి 10న సినిమా రిలీజ్ కానుంది.