పవన్ కళ్యాణ్ డబ్బులు నాకు వద్దు – కిన్నెర మొగుల‌య్య

కిన్నెర వాద్య కళాకారుడు దర్శనం మొగులయ్య కు పవన్ కళ్యాణ్ రెండు లక్షల ఆర్ధిక సాయం చేసిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ పంపించిన డబ్బులు నేను తీసుకోను అని అంటున్నారు కిన్నెర మొగుల‌య్య‌. తాను ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఒక‌సారి క‌లిసాన‌ని మ‌రోసారి అంత‌గొప్ప వ్య‌క్తిని క‌ల‌వాల‌ని అన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ను క‌లిసిన త‌ర‌వాతే ఆ డ‌బ్బులు తీసుకుంటా అని కిన్నెర మొగుల‌య్య చెపుతున్నాడు. ఇప్ప‌టికే త‌న కు డ‌బ్బులు పంపించారని..డబ్బు తీసుకోవాలంటూ త‌న‌కు ఫోన్ లు వ‌స్తున్నాయ‌ని మొగుల‌య్య చెప్పారు. కానీ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో మాట్లాడి ఆయ‌న ఎంత ఇస్తే అంత తీసుకుంటానని మొగుల‌య్య తెలిపారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలంలోని అవుసలికుంట మొగులయ్య ష్వగరం. తండ్రి ఎల్లయ్య నుంచి వారసత్వంగా వచ్చిన ఏడు మెట్ల కిన్నెరను పన్నెండు మెట్లుగా మార్చి ప్రదర్శనలిచ్చేవారాయన. అంతరించిపోతున్న కిన్నెర వాద్య కళను కాపాడుతున్న మొగులయ్యను తెలంగాణ ప్రభుత్వం గుర్తించి… ఉగాది పురస్కారంతో ఘనంగా సత్కరించింది. మొగులయ్య గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఆయన్ని చెన్నై పంపించి భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ను పాడించారు. ఇప్పుడు ఆ పాట యూట్యూబ్ లో సంచలన వ్యూస్ రాబడుతుంది.