పవన్‌ సినిమాకు తమన్‌ మ్యూజిక్‌!

SS THAMAN
SS THAMAN

పవన్‌ సినిమాకు  మ్యూజిక్‌!

తెలుగు సినిమా అగ్ర సంగీత దర్శకుల్లో ఒకరిగా వెలుగొందుతున్నాడు ఎస్‌.ఎస్‌.తమన్‌. తన మాస్‌ ట్యూన్స్‌ తో ప్రేక్షకులను ఆకట్టుకునే తమన్‌ ఇటీవల సరైనోడు, శ్రీరస్తు శుభమస్తు చిత్రాలతో యూత్‌ లో క్రేజ్‌ ను సంపాదించుకున్నాడు. అయితే తాజాగా ఆయన పవన్‌ కల్యాణ్‌ సినిమాకు మ్యూజిక్‌ చేసే అవకాశం సంపాదించినట్లు తెలుస్తోంది. పవన్‌ సర్ధార్‌ గబ్బర్‌ సింగ్‌ సినిమా తరువాత తన జోరు కాస్త పెంచాడు. ఒకవైపున కాటమరాయుడు సినిమాలో నటిస్తూనే మరోవైపు తమిళ దర్శకుడు నేసన్‌ దర్శకత్వంలో ఓ సినిమా, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌ లో ఓ సినిమా ప్రారంభించేశాడు. అయితే త్రివిక్రమ్‌ సినిమాకు గానూ.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ గా అనిరుధ్‌ ను తీసుకున్నారు. నేసన్‌ డైరెక్షన్‌ లో రాబోయే సినిమాలో సంగీత దర్శకుడిగా తమన్‌ ను సెలెక్ట్‌ చేసుకున్నారు. ఈ సినిమాలో ఛాన్స్‌ రావడం ఎంతో ఆనందంగా ఉందని తమన్‌ తన ట్విటర్‌ ద్వారా తెలిపారు. పవన్‌ సినిమాతో పాటు చిరంజీవి 151వ సినిమాకు కూడా మ్యూజిక్‌ చేసే అవకాశం కూడా తమన్‌ కే దక్కనుందని సమాచారం.