పవన్‌ వ్యాఖ్యలు అర్ధరహితం: బోండా ఉమ

MLA Bonda UMA
MLA Bonda UMA

విజయవాడ: ఏపికి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయంపై జాతీయ ఛానెళ్లలోనూ కథనాలు వస్తున్నాయని మోది ప్రభుత్వాన్ని అందరూ విమర్శిస్తున్నారని టిడిపి నేత బోండా ఉమ అన్నారు. ఈ రోజు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగేలా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడారని ఆయన వ్యాఖ్యలు అర్ధరహితంగా ,బాధ్యతారహితంగా ఉన్నాయని, ప్రజలు వాటిని పూర్తి స్థాయిలో అర్ధం చేసుకుంటాన్నారని చెప్పారు. పవన్‌ అవగాహనారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.