పవన్‌ ఉక్కిరిబిక్కిరి!

PAWAN-1
PAWAN

పవన్‌ కల్యాణ్‌ ఉక్కిరిబిక్కిరి!

అసెంబ్లీలో సిఎం, మంత్రుల విమర్శ
సమన్వయ కమిటీ భేటీలోనూ వదల్లేదు
మీడియా సమావేశంలో మంత్రుల మాటల దాడి

అమరావతి : జనసేన పార్టీ పవన్‌కళ్యాణ్‌పై తెలుగుదేశం పార్టీ విమర్శల దాడిని మం గళవారం ఉధృతం చేసింది. ముఖ్య మం త్రి మొదలకుని శాసన సభ్యుల వరకు తెలు గుదేశం పార్టీ నేత లంతా పవన్‌ లక్ష్యంగా మాటల తూటాలు పేలుస్తున్నారు. రాష్ట్ర శాసనసభలో, శాసన మండలిలో, తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ భేటీలో, మీడియా సమావేశాల్లోనూ పవన్‌పై విమర్శలు ఎక్కు పెట్టారు. ఉదయం ఢిల్లీలో ఉన్న పార్టీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించినపడు, అసెంబ్లీలో చర్చలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్‌కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు. బిజెపి, వైసీపీ, జనసేన మూ డు పార్టీలు ఒకే అజెండాతో టిడి పిపై బురద జల్లడమే ఎజెండాగా పెట్టుకున్నాయని, వైసీపీ, జనసేన బిజెపికి కోవర్టులుగా పని చేస్తున్నాయని విమర్శించారు. పవన్‌కళ్యాణ్‌ పచ్చిఅబద్దాలు మాట్లాడుతున్నారంటూ నిన్న లోకేష్‌, శేఖర్‌రెడ్డికి ముడిపెట్టారు, నేడు పోలవరం ప్రాజెక్ట్‌పై అవి నీతి ఆరోపణలు చేస్తున్నారన్నారు.