పవన్‌పై మండిపడ్డ ఎపి మంత్రి లోకేష్‌

AP MINISTER LOKESH
AP MINISTER LOKESH

పవన్‌పై మండిపడ్డ ఎపి మంత్రి లోకేష్‌

అమరావతి: రాష్ట్రాభివృద్ధికి రాత్రి పగలు తేడాలేకుండా రాత్రి 11 గంటలవరకు కష్టపడి పనిచేస్తున్నాం, ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి నిధులు లేకున్నా రాజధాని నిర్మాణం చేపట్టిన మాకు 2.5 మార్కులెస్తారా? అని రాష్ట్ర ఐటి, పంచాయితీరాజ్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ పవన్‌పై విరుచుకపడ్డారు. మంగళవారం మంత్రి తన కార్యాలయం లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విడగొడితే అమరావతిని రాజధానిగా చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కేరాఫ్‌ అడ్రస్‌ సృష్టించారని అటువంటిది పవన్‌ కళ్యాణ్‌ ఆయన ప్రభుత్వానికి 2.5 మార్కులేయడమేంటని నిలదీశారు. పోలవరం నిధులపై స్పందిస్తూ పోలరవం నిధులన్నీ అథారిటీ ద్వారా ఖర్చుపెడుతున్నారని, ఆ ఆధారిటీ కేంద్రం ఆధీనంలో వుందని స్పష్టం చేశారు.