పవన్‌కల్యాణ్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు

Pawan Kalyan
Pawan Kalyan

హైదరాబాద్‌: క్రిస్మస్‌ పర్యదినాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ చీఫ్‌ పవన్‌కల్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఆయన ఒక ప్రకటనలో ఈ క్రిస్మస్‌ పండుగ ప్రతీ కుటుంబంలో సుఖ సంతోషాలను తీసుకురావాలని ఆకాక్షించారు. ప్రజలంతా శాంతి, సౌభాగ్యాలతో వర్థిల్లాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. అలాగే పవన్‌కల్యాణ్‌ క్రిస్మస్‌ పండుగ సందేశాన్ని ఫేస్‌బుక్‌లో పోస్టో చేశారు. దీనికి క్రిస్మస్‌ ట్రీ ఫొటోను కూడా జత చేశారు. కాగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తన కుటుంబంతో కలిసి ప్రస్తుతం యూరప్‌లో ఉన్నారు. అక్కడి నుండి ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలియచేశారు.