‘పవనిజం-2 ప్రారంభం

PAWANISM21
PAWANISM2

‘పవనిజం-2 ‘ప్రారంభం

అక్టోబర్‌ 11న తేదీ పవన్‌ అభిమానులకు చాలా గుర్తుండే రోజు ఎందుకంటే ఆయన తొలి చిత్రం ‘ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రిలీజ్‌ డేట్‌ అది.. దీంతో అప్పటి నుంచి అక్టోబర 11వ తేదీన పవనిజం డే గా ఆయన అభిమానులు జరుపుకుంటున్నారు..కాగా ఈ సందర్భాన్ని పురస్కరించుని ఆర్‌కె స్టూడియోస్‌ బ్యానర్‌పై గుంటూరు టాకీస్‌ చిత్రాన్ని నిర్మించిన ఎం.రాజ్‌కుమార్‌ ‘పవనిజం-2 అనేచిత్రాన్ని నిర్మిస్తున్నట్టు ప్రకటించారు.
సొసైటీపై ప్రతి ఒక్కరి బాధ్యత అనేది ఉండాలి. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉన్న ఒక కుర్రాడికి సమాజంలో ఉన్న పరిస్థితులు అతడిని రాజకీయాల్లోకి ప్రవేశించేలా చేస్తాయి అవినీతి రాజకీయా నాయకుల్ని ఎదుర్కొని సమాజంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చాడు అనేది ఈ చిత్రకథాంశంగా చెప్పారు.. ఈనెలలోనే చిత్రం సెట్స్‌పైకి వెళ్తుందని యూనిట్‌తెలిపింది.. మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే డైరెక్షన్‌ క్రిష్ణ చేతన్‌, డిఒపి రామిరెడ్డి,కోప్రొడ్యూసర్‌ రాజశ్రీ, ఎంఎం సాయిరాజ్‌ పవన్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ సుజనారాజ్‌ మత్రాసి, ప్రొడ్యూసర్‌: ఎం.రాజ్‌కుమార్‌,