పల్లెల్లో ఆమడదూరంలో అభివృద్ధి

ప్రజావాక్కు
              పల్లెల్లో ఆమడదూరంలో అభివృద్ధి

villages
villages

పల్లెల్లో ఆమడదూరంలో అభివృద్ధి
దేశాభివృద్ధికి పట్టుగొమ్మలైన పల్లెలను అభివృద్ధిబాటలో నడి పించడంలో ప్రభుత్వాలకు చిత్తశుద్ధి కొరవడింది. ప్రభుత్వం ఉదారంగా నిధులు మంజూరు చేస్తున్నా పంచాయతీలలో మెరుగైన పాలనకు అధికారగణం ఎలాంటి చిత్తశుద్ధి లేకపోవ డం వలన పల్లెలలో అభివృద్ధి ఆమడదూరంలో ఆగిపోయింది. తిత్లీతోతీవ్రంగా నష్టపోయినగ్రామాలకు విద్యుత్‌ పునరుద్ధరించి రెండు నెలలు కావస్తున్నా నేటికీ వీధి దీపాలు వేయలేదు. శుభ్రతా చర్యలు చేపట్టకపోవడం వలన అంతటా దుర్గంధం వ్యాపించి పలు ప్రాణాంతక వ్యాధులకు నిలయంగా శ్రీకాకుళం జిల్లా మారింది. తుపాన్‌తో అనేక గ్రామాలలో నీటి వనరులు కలుషితమవడవలన ప్రజలకు తగినంత సంఖ్యలో ట్యాంకర్లు రక్షిత మంచి నీటి పథకాల ద్వారా నీటి సరఫరా జరగడం లేదు.చీకటిపడితేచాలు ఏజెన్సీగ్రామాలలో అటవీ జంతువ్ఞలు, విషసర్పాల సంచారంతో ప్రజలు భయభ్రాంతులవ్ఞతున్నారు.
– సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

నిరుద్యోగ సమస్యను అధిగమించాలి
ప్రస్తుతం దేశంలో లభ్యమవ్ఞతున్న యువత, నిరుద్యోగం దృష్టిలో ఉంచుకుంటే ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకున్న ఏడు శాతం వృద్ధి ఎందుకు సరిపోదన్న రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌, ప్రముఖ ఆర్థికవేత్త రఘురామ్‌రాజన్‌ వ్యాఖ్యలు ప్ర భుత్వానికి దిక్సూచికావాలి. ఉద్యోగకల్పన, వాణిజ్యం పరస్పర ఆధారితాలు ఉన్న మనదేశంలో నిరుద్యోగం సమస్యను రూపు మాపాలంటే వాణిజ్యాన్ని కనీసం రెండింతలు చేయాల్సిన అవ శ్యకత ఎంతో ఉంది. చైనావలె తక్కువ ధరలకు వస్తువ్ఞలను ప్రపంచ విపణిలోకి చేర్చడం అనేది నేడు భారత్‌కు పెను సవాలుగా మారుతోంది.ఐరోపా,మధ్య ఆసియాదేశాలతో వ్యా పారం చేసే మార్గాలు మూసుకపోవడం దురదృష్టకరం.
-ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
కొన్ని రాష్ట్రాలలో మద్యం అమ్మకాలు, ఉపరితల బొగ్గు, ఇతర ఖనిజాల తవ్వకం ప్రధాన ఆదాయవనరులుగా మలుచుకోవ డంవలన ప్రజారోగ్యం ధ్వంసంకావడంతోపాటుప్రకృతి విధ్వం సం అప్రతిహతంగా సాగుతోంది. కొన్ని ప్రభుత్వాలు ఇసుక ఆదాయం కోసం ప్రయత్నిస్తుండటం వలన పర్యావరణం సమతుల్యత కోల్పోతోంది.కోట్లరూపాయల ప్రజాధనంతో నిర్మి తమైన రోడ్లుఇసుకలారీల దుమ్ములో చిధ్రమైపోతున్నాయి.
-బి.రమేశ్‌, హైదరాబాద్‌

కేసుల విచారణలో జాప్యం
సిక్కుల ఊచకోత కేసులు నేటికీ తేలకపోవడం వైపరీత్యం. అందులో ఒక నిందితుడు కాంగ్రెస్‌ ప్రముఖుడు నాటి పార్ల మెంటు సభ్యుడు సజ్జన్‌కుమార్‌కి ఢిల్లీలో ఒక కుటుంబంలో ఐదుగురి హత్యకి సంబంధించి యావజ్జీవ కారాగారశిక్ష ఖరారు చేస్తూ హైకోర్టుతీర్పు నివ్వడం కాస్తంత ఊరట. నాడు యువకు నిగా అమానవీయ నేరం చేసిన ప్రజాప్రతినిధి నేడు 34 ఏళ్ల పిమ్మట తన 73ఏళ్ల వయస్సులో శిక్షని పొందబోతున్నాడన్న మాట. పై కోర్టుకి అప్పీల్‌ చేయడం ద్వారా శిక్షను వాయిదా వేసుకొనే వెసులుబాటు ఇంకా ఆయనకు మిగిలే ఉంది. ఆ ప్రక్రి య తెమిలేసరికి మరో అర్థ దశాబ్దం పట్టొచ్చు. వందమంది నేరస్తులు తప్పించుకోవచ్చు. కానీ ఒక్క అమాయకుడు శిక్ష పొందరాదన్న స్ఫూర్తితో మనదేశంలో ఏర్పరుచుకున్న అంచెలంచెల న్యాయప్రక్రియ ఈవిధంగా తీవ్రమైన కేసుల్లో కూడా జాప్యానికి కారణమవ్ఞతుంది.
-డా.డి.వి.జి.శంకరరావ్ఞ, పార్వతీపురం

ఇంటర్‌ మార్కుల వైటేజ్‌ పెంచాలి
ఎంసెట్‌, ఇతర వృత్తి విద్యాకోర్సుల ప్రవేశ పరీక్షలకు ఇంట ర్మీడియేట్‌ పాఠాలు మూలాధారం కనుక ఇంటరు మార్కుల వైటేజ్‌ శాతం ఇంకా పెంచి న్యాయం చేయాలి. కొంత మంది స్వార్థపరశక్తులు దీనిని వ్యతిరేకిస్తారు. వారి వాదన ఏమిటంటే ఇంటర్‌ పరీక్షలు పల్లెటూళ్లలో జరుగుతాయని, కాపీలు ఎక్కువగా జరుగుతాయని అంటారు. కానీ ఎంసెట్‌లో పేపరు తయారీ దగ్గర నుండి పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన వరకు అన్ని మోసాలే కుంభకోణాలే.
-గోపాలుని శ్రీరామమూర్తి, గుంటూరుజిల్లా

ధ్వని కాలుష్యాన్ని నివారించాలి
ధ్వని కాలుష్యాన్ని నివారించే చట్టాలు, అధికారాల మాట ఎలా ఉన్నా చెవ్ఞల తుప్పు వదిలేలా ధ్వని కాలుష్యం పెరుగుతూనే ఉంది. సమయాలను కూడా పాటించకుండా మైకులను హోర ెత్తించే వారు అనేకమంది. మతవిశ్వాసాలు, శుభకార్యాల పేరిట మైకులు రోద పెడుతున్నా పట్టించుకునే వారేరి? అత్యవసర పరిస్థితిలో మాత్రమే తక్కువ ధ్వనులు వెలువరించే సౌండ్‌ బాక్స్‌లను ఉపయోగించుకునేలా కట్టుదిట్టమైన నిబంధనలు విధించాలి.ఈ మధ్య డీజెలనుపెట్టి విపరీతంగా ధ్వని కాలుష్యా న్ని పెంచుతున్నారు. సెల్‌ఫోన్‌ కాలుష్యంకూడా బస్సు ప్రయా ణాల్లో బాగా పెరిగిపోయింది. ఇకనైనా ధ్వని కాలుష్యాన్ని అరికట్టడానికి సంబంధిత అధికారులు కృషి చేయాలి.
-ఆర్‌.సురేష్‌, నల్గొండ