పల్లెటూరి పిల్లగా రకుల్‌!

Rakul preet singh
Rakul preet singh

పల్లెటూరి పిల్లగా రకుల్‌!

తెరపై చురుకుగా .. చలాకీగా కనిపిస్తూ యూత్‌ హృదయాలను దొచుకునే కథానాయికల జాబితాలో రకుల్‌ పేరు ముందుగా కనిపిస్తుంది. స్వీట్‌ స్మైల్‌ తో కుర్రకారు మనసు దొచుకునే రకుల్‌, మొదటి నుంచి కూడా అwల్టా మోడ్రన్‌ అమ్మాయిగానే అలరిస్తూ వచ్చింది. వరుస విజయాలు తన ఖాతాలో చేరుతుండటంతో, పాత్రల ఎంపికలో రకుల్‌ మరింత జాగ్రత్త చూపుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే నాగ చైతన్య సినిమాలో ఆమె పల్లెటూరి పిల్లగా కనిపించనుంది. కల్యాణ్‌ కష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, అందమైన పల్లె పిల్లగా అలరించనుంది. ఈ పాత్ర తనకి ఎంతగానో నచ్చేసిందని రకుల్‌ చెబుతోంది. ఇంతవరకూ తెరపై తాను కనిపించిన విధానానికి పూర్తి భిన్నంగా ఈ సినిమాలో కనిపిస్తానని అంటోంది. ఈ పాత్ర తనకి మరింత మంచి పేరు తీసుకువస్తుందని చెప్పుకొచ్చింది. ఈ సినిమాకి రారండో§్‌ు వేడుక చూద్దాం అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నారు.