పల్నాడులో టిడిపి-వైఎస్సార్సీ వాగ్వాదం

TDP-YSRCP
TDP-YSRCP

గుంటూరు: పల్నాడులో ఉద్రిక్తత నెలకొంది. మైనింగ్‌ వ్యవహారంలో టిడిపి, వైఎస్సార్సీ మధ్య వాగ్వాదం కొనసాగుతోంది. అక్రమ మైనింగ్‌ క్వారీలను సందర్శించేందుకు వైఎస్పార్సీ నేతలు సిద్ధమయ్యారు. చలో దాచేపల్లికి పిలుపునిచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతవరణం నెలకొంది. ఎక్కడిక్కడే నేతలను అరెస్ట్‌ చేశారు. ముఖ్యనేతలను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. గురజాలలో 144సెక్షన్‌ అమలు చేస్తున్నారు. మరోవైపు గురజాలలో నిజనిర్ధారణ కమిటీ పర్యటించనుంది. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రైలులో వెళుతున్న మాజీ ఎమ్మెల్సీ జిటివి కృష్ణారెడ్డిని నడికుడి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో 25నిమిషాలు రైలును నిలిపివేశారు. మంత్రి బొత్స నారాయణను తాడేపల్లి టోల్‌గేటు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుగ్గిరాల పిఎస్‌కు తరలించారు. కాగా, తనను రాజకీయంగా ఎదుర్కోలేక వైఎస్సార్సీ అక్రమ మైనింగ్‌ ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుఅన్నారు. సరస్వతి సిమెంట్‌ ఫ్యాక్టరీ భూముల్లో రైతులుసాగు చేయడాన్ని సమర్థించినందుకే తనపై కక్ష కట్టారని ఆయన అన్నారు.