పలు పరీక్షల తేదీలను ప్రకటించిన ఏపి ప్రభుత్వం

exams
exams

అమరావతి: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా పలు పరీక్షలను నిలిపివేశారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిస్తున్న ప్రభుత్వం నిలిచిపోయిన పరీక్షలను నిర్వహించాలని భావిస్తుంది ఈ నేపథ్యంలో భాగంగా పలు పరీక్షల తేదీలను ప్రకటించింది. ఇందులో ఎంసెట్‌ పరీక్షలను జులై 27 నుంచి 31 వరకు నిర్వహించనున్నారు. అలాగే జులై 24 న ఈసెట్‌, జులై 25న ఐసెట్‌ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/