పర్యావరణ పరిరక్షణలో ప్రవక్త సూక్తులు ఆదర్శం

ఆధ్యాత్మిక ప్రబోధం

MASJID1

MASJID

ఉజూ లేక గుసుల్‌ చేయడానికి కూడా నీరు పరిశుభ్రంగా ఉండాలి. నీరు నిలువ ఉండే కుంటలు, కోనేరులు, చిన్న చెరువ్ఞల నీటికంటే పారే నదుల నీరు మంచివి. నమాజ్‌ చేయడానికి ఉజూ చేయడం అవసరం. ఉజూ లేకుండా నమాజ్‌ నెరవేరదు. మనిషి లైంగిక అశుద్ధావస్థలో ఉంటే గుసుల్‌ (శాస్త్రయుక్తమైన తలంటు స్నానం) చేయవలసి ఉంటుంది. ఏదైనా పాత్రలో కుక్క నీళ్ళుతాగితే ఆ పాత్రను ఏడుసార్లు కడగాలి. (బుఖారి) వర్షంనీరు, వడగళ్ళనీరు, మంచు శుద్ధమైనవి. మరుగుదొడ్డికి వెళ్ళే ముందుగా ఎడమకాలు ముందరపెట్టిపోవాలి. అలాగే మరుగుదొడ్డి నుండి బయటకు వెడలునప్పుడు ముందుగా కుడికాలు పెట్టాలి. (అబూదావూద్‌) టాయిలెట్‌లోనికి వెళ్ళునపుడు పాదరక్షలతో వెళ్ళాలి. నిలబడి మూత్రవిసర్జన చేయరాదు. మూత్రపు చుక్కలు బట్టలమీద పడకుండా జాగ్రత్త వహించాలి. అలా కానిచో సమాధి శిక్షను అనుభవించవలసి ఉంటుంది.

ప్రజలు నడిచే దారుల్లో, నీడ ఉండేచోట, నీళ్ళు తీసుకుపోయే చోట్లలో, ఇతర ప్రాంతాల్లోనూ మలమూత్ర విసర్జన చేయరాదు. ఇలాంటి ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన వల్ల ఇతరులకు బాధకలుగుతుంది. చెరువ్ఞలు, కుంటలు, బావ్ఞలు మొదలైన వాటి నీరు నిలకడగా ఉంటుంది కనుక నిలకడగా ఉన్న నీటిలో మలమూత్ర విసర్జన చేయడం వల్ల ఆ నీరు కలుషితమై దుర్గంధ పూరితమై భయంకరంగా ఉంటుంది. దానివల్ల పరిసర ప్రాంత ప్రజలు రోగాలచే బాధించబడతారు. ఇస్లాంధర్మం ఇలాంటి చిన్న చిన్న విషయాలను సైతమూ ఇంత స్ఫష్టంగా, ఇంత గట్టిగా తాకీదు చేస్తుందంటే ఈ ధర్మ సమగ్రతకు ఇది ఒక మచ్చుతునక మాత్రమే! దైవ ప్రవక్త(స) నిలిచిఉన్న నీటిలో మూత్రం పోయడాన్ని వారించారు.

(ముస్లిం) గాలి కాలుష్యం:- ఇతర దైవానుగ్రహాల మాదిరిగా గాలి కూడా ఒక దైవానుగ్రహమే. మనిషి ఆరోగ్యానికి, ఉపాధి, వనరులకు అది చాలా అవసరం. గాలిలేకుండా ఒక నిమిషం కూడా బ్రతకలేము. అయితే దేవ్ఞడే తలచుకుంటే ఆయన గాలిలో సాంద్రతను, వేగాన్ని పెంచి దాన్నే వినాశకారినిగా మార్చగలడు కనుక దైవసన్నిధిలో దానిలోని మంచిని కోరుకుని చెడుల నుండి కాపాడమని శరణు వేడుకోవాలి. శబ్ద కాలుష్యం:- మస్జిద్‌లో బిగ్గరగా అరవటం, పోట్లాడటం, పోయిన వస్తువ్ఞల గురించి ప్రకటనలు చేయటం, కొనుగోలు, అమ్మకాలు, బాడుగలు, కూలీల వ్యవహారం తగదు. మస్జిద్‌లో బిగ్గరగా మాట్లాడటం మస్జిద్‌ గౌరవానికి విరుద్ధం.

ఈ నేరానికి పాల్పడేవారికి శికకూడా విధించవచ్చు. హజ్రత్‌ ఉమర్‌ (రజి) ఇద్దరు వ్యక్తులు మస్జిద్‌లో బిగ్గరగా మాట్లాడినందుకు గద్దించారు. ఈ విధంగా పర్యావరణ పరిరక్షణ పాటించుటలో మహనీయ ప్రవక్త(స) తన మాటలచే, చేతలచే పధ్నాలుగు వందల సంవత్సరాలకు ముందే ఆదర్శంగా నిలిచారు.

– షేఖ్‌ అబ్దుల్‌ హఖ్‌