పర్యాటక రంగంపై దృష్టి సారించాలి

మానసిక ఉల్లాసానికి విశ్రాంతంగా గడిపేందుకు పర్యాట క రంగం ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. కాలానుగుణంగా వస్తున్న మార్పులు, ఒత్తిళ్లు నుండి విముక్తికి, ఆనందంకోసం, నేడు కుటుంబ సమేతంగా నూతన ప్రదే శాలను సందర్శించడం అత్యంత ప్రజాదరణ పొందింది. ఎండాకా లంలో పిల్లల పాఠశాలలకు సెలవులు ఇస్తే చాలు చాలా మంది ఇతర ప్రదేశాలను సందర్శించడానికి వెళ్తారు. మంచి రాబడులతో, పర్యాటకరంగం రోజురోజుకు అభివృద్ధిచెందుతూ పరిశ్రమగా వర్థి ల్లుతుంది. నేడు మనదేశంలో పర్యాటకరంగం మరింత ఉధృతమైన అభివృద్ధిని సాధించింది. విదేశీ పర్యాటకుల సంఖ్య, స్వదేశీ పర్యా టకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అంతర్గత దేశీయ పర్యాటకం కూడా గణనీయమైన పాత్రవహిస్తుంది. దేశంలోని సీర్వీసు ఇండస్ట్రీలు అన్నింటా పర్యాటకరంగం మొదటి స్థానంలో ఉంది. పర్యాటకరంగం వివిధ దేశాలు, సంస్కృతుల మధ్య సదవ గాహనకు సయోధ్యవారధిగా పనిచేస్తూ ఆదాయంను చేకూరుస్తుంది. దేశ ఆర్థికాభివృధ్ధి సాధనలో టూరిజం పాత్ర చాలా ఉంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తొలగించడానికి, గ్రామీణప్రాంతాల్లో సమస్యలను పరిష్కరించేందుకు గ్రామీణ పర్యా టకరంగం ఎంతో దోహపదపడుతుంది. గ్రామీణ ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి, ప్రజల జీవనానికి, ఉపాధికల్పనకు గ్రామీణ పర్యాటక రంగం తోడ్పడుతుంది. పర్యాటక రంగం రెండవ అతిపెద్ద విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించే వ్యవస్థ. పర్యాటక రంగానికి ఎగుమతుల పరిశ్రమ ప్రతిపత్తి కల్పించారు. మౌలికవసతుల పరిశ్రమ ప్రతిపత్తి పర్యాటకరంగానికి కల్పించారు. ప్రస్తుతం స్థూలజాతీయోత్పత్తిలో పర్యాటకరంగం వాటాను 2020 సంవత్సరానికి 7 శాతం పైటా పెరిగి 8.5లక్షల కోట్ల వాటా కలిగి ఉండగలవని అంచనా వేస్తున్నారు. భౌగోళిక పర్యాటకం మనిషి ప్రకృతి, సంస్కృతి మధ్య సృజనాత్మక సమన్వయాన్నిసాధిస్తుంది. ప్రదేశం, పర్యావరణ, వాతావరణం, ప్రజల సంస్కృతి, భాష, ఆహారపు అలవాట్లు, వస్త్రధారణ వంటి అంశాలు ఎంతో వైవిధ్యం గోచరిస్తుంది. పర్యాటకరంగాన్ని మరింత ఆకర్షణీయంగా అభివృద్ధి చేసి, మార్కెటింగ్‌ సదుపాయాలను మెరు గుపరచే లక్ష్యంతో ప్రారంభించిన ఇన్‌క్రెటిబుట్‌ ఇండియా ప్రచారంలో మనదేశం పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి పెరగడంతో విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుచున్నది. ఆరువేల సంవత్సరాల నాగరికత, భిన్నసంస్కృతులు కళారూపాలు, వైవిద్యభరితమైన జీవన విధానాలు మనదేశపు సహజసంపదలు, మన ఆచార వ్యవహారాలు అలవాట్లు,పండుగలు, కళలు,సంస్కృతి, సాంప్రదాయాలు, కట్టుబా ట్లు, చేతివృత్తులు, సంగీత సాహిత్యాలు, నృత్యాలు, ప్రాచీనశిల్ప సంపద, విగ్రహాలు, వీధులు, నోరూరించేవంటకాలు ఇవన్నీ కూడా పర్యాటకులను ఆకర్షిస్తాయి. పురాతనకట్టడాలు, ప్రకృతిసౌందర్యా లు, ప్రకృతిప్రదేశాలు, సాంస్కృతిక ఆస్తులు, మన నాగరికత పట్ల విస్తృత ప్రచారం కల్పించాలి. పర్యాటకులను ఆకర్షించే విధంగా వుండాలి. శారీరకదారుత్యాన్ని బలపరచటానికి, మానసిక వికాసా నికి, సాంస్కృతిక రంగ అభివృద్ధికి, ఆధ్యత్మిక, ధార్మికభావనలను పెంపొందింపచేయటానికి పర్యాటకరంగం ఒక చక్కని వేదిక అని కేంద్ర పర్యాటకరంగపాలసీలో పేర్కొంది.
ఆధునిక కాలంలో పర్యాటకరంగంలో మెరుగైన వసతులు, సౌక ర్యాలు బాగా అభివృద్ధిచెందడంతో, ధనికులతోపాటు,సామాన్యులు, మధ్యతరగతి కుటుంబీకులు అతి తక్కువ ఖర్చుతో ఒక దేశం నుండి మరో దేశానికి వెళ్లి వైద్యసేవలు, చికిత్సలు పొందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా నేడు విశేష ప్రాచుర్యం పొందిన పొందుతున్న యోగా ఆయుర్వేదంలకు పుట్టి నిల్లు భారతదేశం.ప్రస్తుతం యోగా మనదేశం కన్న పాశ్చాత్య దేశాలలోనే ఎక్కువ అభివృద్ధి చెందింది. ప్రత్యామ్నాయ వైద్య విధానాలు ఏమీ అందుబాటులో లేకపోవడం తో ప్రజలు తప్పనిసరి పరిస్థితులలో అలోపతి (ఇంగ్లీష్‌ మెడిసన్‌) వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. సంప్రదాయ, పురాతన వైద్య విధానాల పట్ల ఆసక్తి తోడైతే, వైద్య పర్యాటకం మరింతగా పెరిగగలదు. కేరళలో వైద్య పర్యాటకరంగంలో ఆయుర్వేద హెల్త్‌కేర్‌ సెంటర్లు పర్యాటకులనుఆకర్షిస్తున్నది.యునాని,నేచురోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, యోగసిద్ధ వంటి మన ఆరోగ్యచికిత్సా విధానాలపట్ల విదేశీయులు పర్యాటకంగా మనదేశానికి వస్తున్నవారి సంఖ్య గణనీ యంగా పెరుగుతుంది. ఇతర వైద్యాలతో పోలిస్తే ఖర్చు తక్కువ. ఎలాంటి ప్రతిచర్యలు (రియాక్షన్‌), ఔషధాల వినియోగం కారణంగా వచ్చే రుగ్మతలు లేకుండా తక్కువ ఖర్చుతో శాశ్వత ఉపశమనాన్ని కలుగజేసే అందరికీ సురక్షితమైంది హోమియో వైద్యం. హీలింగ్‌ సిస్టమ్‌ ప్రాముఖ్యత పెరిగింది. వైద్య పర్యాటకుల సంఖ్య పెరుగు తుంది. గ్రామీణప్రాంతాలకు మౌలికసదుపాయాలు చేరితే గ్రామీణ పర్యాటక రంగానికి జాతీయంగా, అంతర్జాతీయంగా గుర్తింపు ఏర్పడటం. స్వదేశీ పర్యాటకులు సంవత్సరానికి 10 శాతం చొప్పున విదేశీ పర్యాటకులు 8 శాతం చొప్పున పెరుగుచున్నారు. గుజరాత్‌ తరహా అన్నిరాష్ట్రాల్లో పర్యాటకరంగాన్ని అభివృద్ధిని సాధించాలి.
పర్యాటక రంగ అభివృద్ధి వేగిరపరచుటకై మౌలిక వసతుల కల్పన పై దృష్టి కేంద్రీకరిస్తూ రాయితీలకల్పన ప్రత్యేక పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలాంటి ప్రత్యేక చర్యలను పటిష్టపరచాలి. గ్రామీణ పర్యాట కరంగాన్ని ప్రోత్సాహించాలి. గ్రామీణ ప్రాంతాల జీవన విధానం, అక్కడి చేతి వృత్తులు, హస్తకళలకు అత్యంత ప్రాధాన్యత లభిస్తుంది. వ్యవసాయ టూరిజం,పర్యావరణ టూరిజం, సాహసటూరిజం తది తర అంశాలలో గ్రామీణులను ప్రోత్సహించాలి. కల్చరల్‌ టూరి జం, జియోటూరిజం,హెరిటేజ్‌టూరిజం,వన్యప్రాణిటూరిజం, వైద్య టూరిజం, వింటర్‌టూరిజం, మతపరమైనటూరిజం వంటి ఎన్నో టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధిపరచాలి. జియోపార్క్‌లను అభివృ ద్ధిపరచాలి. గ్రామీణ పర్యాటక ప్రాంతాలను గ్రామాలకోసం కలుపు రోడ్లు, నీటిసరఫరా, విద్యుద్దీకరణ, టెలి ఫోనులైను, గ్రామీణ ఆరోగ్యం, గ్రామీణ సాగు నీరు మొదలైన కనీస సదుపాయాలను కల్పించాలి. భారత్‌ నిర్మాణ గ్రామీణాభివృద్ధిపథకాలు అమలు పరచాలి. వారసత్వ పరిరక్షణకు,స్థానికసాధికారతకు,గ్రామీణప్రాంతాల మౌలిక సదుపాయాలకు, పేదరిక నిర్మూలనకు, పట్టణ పునరుజ్జీవనానికి పర్యాటకరంగం సమర్ధవంతంగా పనిచేయాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్ధ అభివృద్ధికి వ్యవసాయ పర్యాటకరంగం ఎంతో దోహదపడగలదు. పర్యాటకులకు దర్శనీయ ప్రదేశాలపట్ల అవగాహన కల్పించ డం,వసతిసౌకర్యాలు, భోజన సౌకర్యాలు మెరుగుపరచడం వీరికి సేవలందించే గైడ్‌లకు, ఇతర సిబ్బందికి నైపుణ్యతను పెంపొందించే చర్యలు చేపట్టాలి. హాస్పటాలిటీ ఎడ్యుకేషన్‌ కోర్సులను ప్రవేశపెట్టాలి. పర్యాటకుల ద్వారా వివిధరాష్ట్రప్రభుత్వాల ఖజానాలకు అధిక మొత్తంలో ఆదాయం లభిస్తుండడంతో పర్యాటకరంగంపై ప్రత్యేక దృష్టి సారించి పర్యాటక క్షేత్రాలను అభివృద్ధిపరచాలి. ప్రముఖ పర్యాటక కేంద్రాలలో కారవాన్‌పార్క్‌లను నెలకొల్పాలి. పర్యాటక కేంద్రాలకు ఆకర్షిణీయం, పరిశుభ్రంతగా, ఆరోగ్యకరంగా ఉండాలి. పర్యాటకరంగంలో ఉపాధికల్పనలు పెంచాలి, బడ్జెట్‌లో నిధులు పెంచాలి. భవిష్యత్‌లో పర్యాటకులకు సేవలందించటానికి కొంత మంది స్కిల్డ్‌, అన్‌స్కిల్డ్‌ సిబ్బంది అందుబాటులో ఉంచాలి.
ఉపాధిఅవకాశాలను కల్పించడంలో ఒకపరిశ్రమగా ఎదిగిన పర్యా టకరంగం కీలకపాత్ర పోషిస్తోంది.భారత్‌లో ఉపాధిఅవకాశాలు పెర గడానికి ఆర్థికమైన ప్రయోజనాలు సాధించడానికి, ప్రోత్సహించవల సిన ప్రధానరంగంగా పర్యాటకరంగం గుర్తించబడింది. రోడ్డు, రవాణా, దూరశ్రవణ ప్రసారసాధనాలు,హోటళ్లు,పారిశుధ్యం వంటి అంశాలపై మరింత ప్రత్యేక శ్రద్ధ వహించినచో పెట్టుబడులకు మార్గం సుగమమౌతుంది. పర్యాటక ప్యాకేజీలలో వైవిద్యం కోసం దగ్గరదగ్గరగా ఉన్నచర్చిలు, దేశాలయాలు, అభయారణ్యాలు, కొల నులు, సరస్సులు, వన్యమృగాలకేంద్రాలు, ఉద్యానవనాలు, నీటి ఊటలు, జలపాతాలు, వారసత్వకట్టడాలు, చారిత్రక నిర్మాణాలు వంటి వాటిని కలుపుతూ కొత్త ప్యాకేజీలను రూపొందించాలి. పర్యాటకరంగానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ, పర్యాటకులకు కావలసినసేవలు, సదుపాయాలు అందించే బాధ్య తను ప్రభుత్వం చేపట్టాలి.పర్యావరణానికి హానికలగకుంటే, సామా జికవాతావరణం కలుషితంకాకుండా ఉండేవిధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పర్యాటకరంగంలో అనుబంధం కలిగినవారందరిలోను సాంఘిక, సామాజిక చైతన్యాన్ని కలిగించాలి. పర్యాటకరంగం అనేది ఉపాధికల్పనకు, సాంఘికసామరస్యానికి, దారిద్య్రనిర్మూల నకు దోహదపడేఅంశం.ఇది దేశఆర్థికవ్యవస్థను అభివృద్ధిపరుస్తుంది, పర్యావరణాన్ని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా రవాణా, హోటళ్లు, క్యాలరింగ్‌, హస్తకళలరంగాలలో నాణ్యతను, వ్యాపారస్థాయిని పెం చుతుంది. దేశంలో ఆర్థికాభివృద్ధి, ఉపాధికల్పనరంగాలలో మారు మూలప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాలలోపర్యాటకరంగం ప్రధాన పాత్రను పోషిస్తున్నది. సరియైన విధాన నిర్ణయాలు అమలు చేపట్టి నయెడల పర్యాటకరంగం మరింత అభివృద్ధికాగాలదు. మౌలిక సదుపాయాల కల్పన, విశిష్టతలను వివరించటానికి తగిన ప్రచా రం, కుటుంబసమేతంగా పాల్గొనేట్లు ఆకర్షణ ఏర్పాట్లు, ఉల్లాసంగా గడపటానికి కాటేజీలు, రెస్టారెంట్‌లు, ఫాపింగ్‌కాంప్లెక్సులను నిర్మిం చాలి.వాతావరణంలో వచ్చేమార్పుల వల్లటూరిజం దెబ్బతింటోంది. వాతావరణ కాలుష్యం వల్ల ప్రకృతి వైపరిత్యాలు వస్తున్నాయి. బుతుధర్మం తారుమారైపోతున్నది. వాతావరణంలో ప్రాణవాయువ్ఞ తగ్గిపోతున్నందు చేత సూర్యుని నుండి వేడి మిక్కటంగా వెలువడి ఉష్ణోగ్రత హెచ్చుతున్నది.ఆరోగ్యం ఆర్థిక సౌష్ఠవం దెబ్బతిని దేశాన్ని పీడిస్తున్నాయి. ప్రకృతి సిద్ధంగా లభ్యమవుతున్న వనరుల్ని సరైన పద్ధతిలో ఉపయోగించకపోవడం వల్లనే పర్యావరణ కాలుష్య సమస్య ఏర్పడుతుంది. వాతావరణంలో ప్లోరైడ్‌ చేరి ఓజోన్‌పొరకు తూట్లుపొడుస్తున్నది. మానవుని అజాగ్రత్త వల్ల పరిశ్రమలు వగైరా వదలిపెట్టే కలుషిత పదార్ధాల వల్ల రసాయనాల వల్ల నదులుసైతం మురికి కాలువల్లా మారుతూన్నయి. పెరిగిపోతున్న వాహనాలసంఖ్య వాయుకాలుష్యానికి ఊతమిస్తుంది.ప్రతివ్యక్తి తాను వాతావరణ జల శబ్దకాలుష్యాలకు కారకుడు కాకుండాఉండాలి. పట్టణాలలో పరిశ్రమ లు జనావాసానికి దూరంగా ఏర్పాటుచేయాలి. వాటి నుంచి వచ్చే కాలుష్యాలను శుద్ధిచేసేమార్గాలను అన్వేషించాలి. వ్యర్ధపదార్థ నియం త్రణామార్గాలు చూడాలి. పరిశ్రమలపై ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలుపరచాలి. సమాజంలో పర్యావరణ పరిరక్షణ కొరకు ఉద్యమించాలి. పచ్చదనంతో నిండిన పరిశుభ్రమైన వాతావరణం ముందు తెచ్చినప్పుడే టూరిజం అభివృద్ధిచెందుతుంది.