పరీక్షల వేళ నిద్ర కరవు!

CAREER
CAREER

పరీక్షలకు అంటే ప్రస్తుతం పిల్లలకు మాత్రమే కాదు, తల్లిదండ్రులకు కూడా పరీక్షలే. ఎందుకంటే పరీక్షల సమయంలో విద్యార్థులు నిద్రలేమికి గురై ఆరోగ్యసమస్యలు తెచ్చుకుంటుం టారు. దాంతో తల్లిదండ్రులకు ఆందోళన తప్పదు. ఈ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పరీక్షల సమయంలో హైరానా వద్దని చెపుతూ తన ‘ఎగ్జామ్స్‌ వారియర్స్‌ పుస్తకంలో ఉపదేశం చేశారు. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రముఖ నగరాల్లో 70 శాతానికిపైగా విద్యార్థులు పరీక్షల సమయంలో సరిగా నిద్రపోవటం లేదని ఒక సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాలైన ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, కోల్‌ కతా జయపుర, చండీగఢ్‌ వంటి నగరాల్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరు తమ సామర్ధ్యానికి అసైన్‌మెంట్లు చేయాల్సి వస్తోందని వెల్లడి ంచారు. చాలా మంది విద్యార్థులు పరీక్షల వేళ శారీరక శ్రమకు, సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. సాధారణంగా విద్యార్థి దశలో రోజుకు అవసరమైన ఏడు గంటల నిద్రను చాలా మంది పొందలేకపోతున్నారు.

విద్యాసంస్థ, ఇల్లు తప్ప బయటికి వెళ్లలేకపోతున్నారు. పరీక్షల సమయంలో చాలామంది విద్యార్థులు తరగతి గదిలో, లేదంటే ఇంట్లో ప్రత్యేక గదిలో బందీలుగా మారిపోతున్నారు. రోజులో గరిష్టంగా 1-2 రెండు గంటల పాటే బయటి ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు. అంతేగాక రోజులో కనీసం గంటలసేపైనా కుటుంబ సభ్యులతో గడపలేకపోతున్నారు. చాలా సంద ర్భాల్లో వారితో కలిసి కనీసం భోజనం కూడా చేయలేకపోతున్నారు. ప్రత్యేక గదిలోకే భోజనం తెప్పించు కుని తినాల్సిన పరిస్థితులు నెలకొంటు న్నాయి. పరీక్షల సమయాల్లో పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. ఏ మాత్రం సమయం దొరికినా ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలకు, సామాజిక మాధ్యమాలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తున్నది. రోజులో కనీసం మూడు గంటలపాటు కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు వినియోగిస్తున్నారు. చదువ్ఞకు సంబంధించిన పనుల్నీ వీటి ద్వారా చేస్తున్నారు. ఆరేడు గంటలపాటు ఆన్‌లైన్‌లో గడుపుతున్నారు.

పరీక్షల సమయంలో విద్యార్థులు నిద్రలేమిని అధిగమించేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని నిపుణలు సూచిస్తున్నారు. సరిపడా నిద్ర ఉంటేనే చదువ్ఞలు తలకెక్కుతాయని స్పష్టం చేస్తున్నారు. పాఠశాల విద్యార్థులకు ఏడు గంటల పాటు నిద్ర అవసర ముంటుంది. ఒక్కోసారి 40-45 నిమిషాల పాటే చదవాలి. తర్వాత 5-10 నిమిషాల విరామం అవసరం.ఇలాంటి విరామాలు లేకుంటే చదివింది ఒంటపపట్టదు. పాఠ్యాంశంలోని కొత్త విష యాల్ని ఒకే రోజు ఎక్కువగా చదువవద్దు. పరీక్షల సమయంలో కొత్తవి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే సమయం వృథా అవ్ఞతుంది. అందుకే అటువంటి ప్రయత్నాలేవి చేయకూడదు. ఫ్లోచార్టులు, గ్రాఫిక్స్‌ రూపంలో సమాధానాన్ని రాసుకుంటే బాగా గుర్తుం టాయి సాధారణంగా ఒకసారి చదివిన విషయాల్ని 24 గంటల్లోనే మరిపోయే అవకాశ ముంటుంది. మొదట చదివిన విషయాన్ని 15, 30 రోజుల్లో చదివితే సత్ఫలితాలుంటాయి. పునశ్చరణ సమయంలో సొంత నోట్సును తయారు చేసుకోవడం మంచిది.