పరిస్థితి అదుపులో ఉంది.. ఆందోళన వద్దు: మేయర్‌ బొంతు

Bontu Rammohan
Bontu Rammohan

హైదరాబాద్‌: చర్లపల్లిలో హెచ్‌పిసిఎల్‌ గ్యాస్‌ గోదాంలో చెలరేగిన మంటలు అదుపులో ఉన్నాయని, స్థానికులు
ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అన్నారు. గ్యాస్‌ గోదాంలో
అగ్ని ప్రమాదం సంభవించిన ఘటనలో మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురై
ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకొని మంటలను అదుపులోకి
తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.