పరిశోధనలపై దృష్టిసారించకనే వెనుకంజ

Pranab Mukharjee
Pranab Mukharjee

పరిశోధనలపై దృష్టిసారించకనే వెనుకంజ

హైదరాబాద్‌: పరిశోధనల పట్ల దృష్టి సారించకపోవటంతో వెనుకబడి ఉన్నామని రాష్ట్రపతి ప్రణబ్‌ అన్నారు.. ఐఐటిల్లో చదివినవారికి వందశాతం ప్లేస్‌మెంట్‌ వస్తోందనిఆయన చెప్పారు.. బుధవారం ఉస్మానియా వర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు..ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో చదివినవారు విదేశాలకు వెళ్లిపోతున్నారన్నారు.. ఉన్నత విద్యాసంస్థలను తప్పు పట్టటం తన ఉద్దేశ్యం కాదన్నారు.

కొత్త ఆలోచనలకు వేదికలు వర్సిటీలు

విశ్వవిద్యాలయాలు కొత్త ఆలోచనలకు వేదికలు అని ప్రణబ్‌ అన్నారు.. ఒయు శతాబ్ది ఉత్సవాల్లో ఆయనప్రసంగిస్తూ భారతదేశం మార్గదర్శిగా నలిచిందన్నారు.. తక్షశిల , విక్రమశిల విశ్వవిద్యాలయాల్లో అనేకమంది అభ్యసించారని అన్నారు.

వందేళ్ల క్రితమే ముందుచూపుతో ప్రారంభమైన వర్సిటీ

పందేళ్ల క్రితమే ముందుచూపుతో ప్రారంభమైన వర్సిటీ ఉస్మానియా వర్సిటీ అని ప్రణబ్‌ అన్నారు.. ఈ వందేళ్లలో వర్సిటీలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు.