పరిశీలకుడి పదవికి సుశీల్‌ రాజీనామా

Susheel kumar

పరిశీలకుడి పదవికి సుశీల్‌ రాజీనామా

న్యూఢిల్లీ: ప్రముఖ రెజ్లర్‌, రెండు సార్లు ఒలింపిక్‌ విజేత సుశీల్‌ కుమార్‌ జాతీయ క్రీడా పరిశీలకుడి (నేషనల్‌ స్పోర్ట్స్‌ అబ్జర్వర్‌) పదవికి రాజీనామా చేశాడు. పరస్పర విరుద్ధ ప్రనయోజనాల (కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌) దృష్ట్యా ప్రస్తుతం కెరీర్‌ కొనసాగిస్తున్న అథ్లెట్లు ఈ పదవిలో ఉండరాదని కేంద్ర క్రీడాశాఖ పేర్కొన్న నేపథ్యంలో సుశీల్‌ కుమార్‌ ఈనిర్ణయం తీసుకున్నాడు.మాజీ క్రీడా శాఖా మంత్రి విజ§్‌ు గోయల్‌ ఈ ఏడాది మార్చిలో 12 మందితో కూడిన జాతీయ పరిశీల కుల బృందాన్ని నియమించారు. అందులో భాగర దిగ్గజ మహిళా బాక్సర్‌ మేరీకోమ్‌ కూడా ఉంది. ఆమె కొద్ది రోజుల క్రితమే ఈ పదవికి రాజీనామా చేసింది. వీరిద్దరి రాజీనామాలను కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ ఆమోదించింది.