పరిపాలన సౌలభ్యం.. పెరగనున్న మండలాలు

Ap Depty CM KE Krishna Murthy
Ap Depty CM KE Krishna Murthy

విజయవాడ: పరిపాలన సౌలభ్యం కోసం ఆంధ్రప్రదేశ్‌లో మండలాలను పెంచబోతున్నామని ఉపముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి అన్నారు. గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. తొలి విడతగా మూడు మండలాలు ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖలో మహారాణిపేట, గోపాలపట్నం, ములగాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాలో ఒక్కో కొత్త అర్బన్‌ మండలాలను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. విజయవాడలో మూడు అర్బన్‌ మండలాలపై అభ్యంతరాలను పరిశీలిస్తున్నామన్నారు. ఏపిలో 51రెవెన్యూ డివిజన్లు ఉన్నాయని, మరో 16 డివిజన్ల కోసం కలెక్టర్లు ప్రతిపాదనలు పంపారని చెప్పారు. ఏపిలో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సాహించేందుకు ‘నాలా చట్టం తీసుకువచ్చామన్నారు. భూ వినియోగ మార్పిడిని సవరించి రుసుములు తగ్గించామన్నారు.