పరాజయాలు అలవాటుగా మారింది!

VIRAT KOHLI
VIRAT KOHLI

హైదరాబాద్‌: ఐపిఎల్‌లో కోహ్లి సేన పరాజయాలను అలవాటుగా మార్చుకుంది. ఇప్పటివరకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఆడిన పది మ్యాచ్‌ల్లో మూడు మ్యాచ్‌లు మాత్రమే గెలిచి ఏడింటిలో ఓడింది. తాజాగా సోమవారం సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఓడి పాయింట్ల పట్టికలో కింది నుంచి మూడో స్థానంలో నిలిచింది. మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ విరాట్‌ మాట్లాడుతూ.. జట్టు ఆట తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమ సామర్ద్యాన్ని తగ్గట్టుగా ఆడలేదన్నారు. ఓటమిని చేజేతులా కొని తెచ్చుకున్నాము అని అన్నాడు. ఇంత ఒత్తిడిలోనూ సన్‌రైజర్స్‌ విజయం సాధించారని ఆ జట్టును ప్రశంసించాడు.