పనుల్లో నిర్లక్ష్యం.. వర్క్‌ ఏజెన్సీలపై కఠిన చర్యలు

 

TS CS SP Singh
TS CS SP Singh

రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు బల్క్‌గా నీటి సరఫరా మార్చి 15వ తేదిలోగా జరగాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్‌ అన్నారు. పనుల్లో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులతో పాటు వర్క్‌ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవడానికి వెనకాడేదిలేదని స్పష్టం చేశారు. శనివారం సచివాలయంలో తన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. మిషన్‌ భగీరథ పనులు ఆశించినంత వేగంగా జరగని సూర్యాపేట, ఆదిలాబాద్‌ సెగ్మెంట్‌లపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఆర్‌డబ్ల్యుఎస్‌ ఈఎన్‌సి సురేందర్‌రెడ్డి, చీఫ్‌ ఇంజనీర్లు విజ§్‌ుప్రకాష్‌, జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పనులు చేస్తున్న జివిపిఆర్‌, మెగా ఏజెన్సీలతో సమావేశం అయ్యారు. శుక్రవారం జరిగిన కలెక్టర్‌ల కాన్ఫరెన్సులో మిషన్‌ భగీరథ పనులపై సమగ్రంగా సమీక్షించిన ప్రభుత్వ ప్రధానంగా కార్యదర్శి, త్వరగా పూర్తిచేసేలా కలెక్టర్లకు దిశానిర్ధేశనం చేశారు. భగీరథ పనులు 90శాతం పూర్తయ్యాని, మిగితా పనులు కూడా త్వరగా పూర్తి చేసేందుకు కలెక్టర్లు మరింత చొరవ చూపాలన్నారు. ఇంట్రా విలేజ్‌ పనులకు గ్రామాల్లో ఎదరయ్యే ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలన్నారు. భగీరథ పనులకే మొదటి ప్రాధాన్య ఇవ్వాలని ఆదేశించారు. కలెక్టర్ల వివరాల ప్రకారం సూర్యాపేట, ఆదిలాబాద్‌ పనులపై సమీక్షించిన సిఎస్‌ ఎందుకు పనులు పూర్తిచేయడం లేదని ప్రతినిధులను ప్రశ్నించారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వర్క్‌ ఏజెన్సీలు పనిచేయకుండా బ్లాక్‌ లిస్టులో చేర్చుతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయా సెగ్మెంట్‌లలో ఎదరవుతున్న ఇబ్బందులను అడిగితెలుసుకున్నారు. పనులకు సంబంధించి ప్రభుత్వం నుంచి సహాయం అవసరం ఉందా అని అడిగి తెలుసుకున్నారు. మిషన్‌భగీరథ ఇంజనీర్లు ఫీల్డ్‌లోనే ఉండి పనులు పూర్తిచేయాలన్నారు. పక్కా ప్రణాళికతో దశల వారీగా గ్రామాలకు బల్క్‌గా నీటిని సరఫరా చేయాలన్నారు. మార్చి 15 నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు నీటి సరఫరా చేయాలన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత స్థితిని ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు. ఇప్పటి వరకు 19 ఇంటెక్‌ వెల్స్‌పూర్తయ్యాయని, మోటార్లు, పంపులు బిగించే ప్రక్రియ వేగంగాజరుగుతుందన్నారు. పలు ఇంటెక్‌ వెల్స్‌ లో ఆ పులు పూర్తయి ట్రయల్‌ రన్‌ ప్రారంభమయిందన్నారు. కొత్తగా నిర్మిస్తున్న 50 నీటి శుద్ది కేంద్రాల్లో 27 పూర్తయినట్లు, 18కేంద్రాలు త్వరలో పూర్తవుతాయన్నారు. మిగిలిన ఐదు కేంద్రాల పనులు పురోగతి ఉన్నాయని, 425 సంపులకు గానూ 403 పూర్తి, 149 జిఎల్‌బిర్‌లలో 144 పూర్తయినట్లు తెలిపారు. 566 ఓహెచ్‌బిఆర్‌/బిపిఆర్‌లకు 474 నిర్మాణం పూర్తయిందని, ఇప్పటి వరకు నీటిని సరఫరా చేసే 49,184 కిలోమీటర్ల పైప్‌లలో 44,323 కిలోమీటర్ల వేయడం పూర్తయిందన్నారు. అదనంగా గ్యాంగ్‌లను పెట్టి మిగిలిన పైప్‌లైన్‌ పనులను చేయిస్తున్నామని అధికారులకు వివరించారు. దీంతో పాటు ఇప్పటి వరకు 4744 గ్రామాలకు బల్క్‌గా భగీరథ నీళ్లు సరఫరా అవుతున్నాయని, మరో 2593 గ్రామాల్లో ఇంటింటికి నల్లా కలెక్షన్లు ఇవ్వడం కూడా పూర్తవుతందన్నారు. వాటిలోని 2251 గ్రామాల్లో నల్లాతో నీళ్లు సరఫరా అవుతున్నాయని తెలిపారు.