పనిలో పలకరింపే హాయి

OFFICE WORK
OFFICE WORK

పనిలో పలకరింపే హాయి

హాయిగా, ఎటువంటి అనారోగ్యాల బారిన పడకుండా దీర్ఘకాలం జీవించాలంటే అర్థం చేసుకొనే జీవిత భాగస్వామి, బంధుమిత్రులతో పాటు ఆఫీసులో చక్కని సహోద్యోగులు కూడా కావాలని అంటున్నాయి తాజా అధ్యయనాలు. అవ్ఞను ఆఫీసులోని సహోద్యోగులతో ఎంత మంచి సుహృద్భావ వాతావరణం ఉంటే అంత చక్కని ఆరోగ్యం సొంతమవ్ఞతుందని ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్‌ విశ్వవిద్యాలయం పేర్కొంది.

ముఖ్యంగా ఆర్థిక, ఇన్సూరెన్స్‌ రంగాల్లో సహోద్యోగులతో కలిసి కూర్చుని సుమారు ఎనిమిది, తొమ్మిది గంటలకు వరకు పనిచేయాల్సి ఉంటుంది. అటువంటప్పుడు తోటివారితో చక్కని అనుబంధం లేకపోయినా తరచూ బేదాభిప్రాయాలు కలుగుతున్నా అది ఆరోగ్యంపై ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. పక్కనున్న వారితో ఏమాత్రం సంబంధం లేనట్టు ఒంటరిగా అయిష్టంగా విధులు నిర్వహించే వారిలో గుండె జబ్బులు రావొచ్చు. అందుకే ఆఫీసులోకి అడుగు పెడుతూనే హాయిగా నవ్ఞ్వతూ తోటివారిని పలకరించడం, పనిలో చిన్నపాటి సలహాలను వారి నుంచి స్వీకరించడం సంస్థ నిర్వహించే ఆట పాటల్లో పాల్గొవడం చాలా అవసరం అని ఈ అధ్యయనం చెబుతోంది.