పనితీరు ప్రామాణికాలే కీలకం

it
IT Sector

పనితీరు ప్రామాణికాలే కీలకం

మాస్‌ లేఆఫ్‌లు అవాస్తవం-నాస్కామ్‌

న్యూఢిల్లీ, మే 14: భారత్‌ సాప్ట్‌వేర్‌రంగంలో మాస్‌ లేఆఫ్‌లు ఉండనే ఉండవని, ఇవన్నీ ఉద్యోగులు సిబ్బంది పనితీరుకు నిర్ణయించిన ప్రామాణికాలేనని సాఫ్ట్‌వేర్‌ యాజమాన్యాల సంఘం నాస్కామ్‌ కొట్టిపారేసింది. భారత్‌ ఐటి రంగం ఇప్పటికీ 1.5 లక్షల మంది ఉద్యోగులకు ఉపాధినిచ్చిందని, ప్రతి ఏటా అంతకుపైబడిన వారిని నియమించుకుం టున్నట్లు వివరించింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కంపెనీల ఉద్యోగులు నిరసన ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తుండటంతో నాస్కామ్‌ లేఆఫ్‌లు కానాకా దని పనితీరు చేరుకోలేని ఉద్యోగులు వెళ్లిపోతు న్నారని స్పష్టంచేసింది. యాంత్రీకరణ విదానాలు పెరగడం, పరిరక్షణ విధానాలు అమెరికా వీసా ఆంక్షలు వంటివి కొంతమేర భారతీయ సంస్థలకు అమెరికాలో స్థానిక నియామకాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తోందన్నారు. టెక్‌ మహీంద్ర ఇటీవే వెయ్యిమంది ఉద్యోగులను నియమించుకుంది.

అంతేకాకుండా ఇన్ఫోసిస్‌, విప్రో, కాగ్నిజెంట్‌ ఇతర సంస్థలన్నీ కూడా ఉద్యోగులను బైటికి పంపిస్తున్న ట్లు అంచనా. ఈ ఏడాది చివరికి లక్షమందికిపైగా ఉద్యోగాలు వదులుకోవాల్సి వస్తుందని సాఫ్ట్‌వేర్‌రం గం నిపుణులు చెపుతున్నారు. నాస్కామ్‌ సంఘం పరిధిలో ప్రస్తుతం 2వేలకుపైగా భారతీయ సాప్ట్‌వేర్‌ ఇతర ఐటి సేవల కంపెనీలు ఉన్నాయి. ఈ ఏడాది అంతగా చెప్పుకోదగిన అంశాలేమీలేవని వివరించిం ది. ఐటి ఫోరమ్‌ ఫైట్‌ వృత్తినిపుణులు తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాలకు ఫిర్యాదులుచేసి తక్షణమే జోక్యంచేసుకోవాలని ఐటి కంపెనీలు అక్రమంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయని ప్రత్యేకించి కాగ్నిజ ెంట్‌ మరింతగా దూసుకుపోతోందని ఆరోపించారు. తెలంగాణప్రభుత్వం నుంచి వచ్చిన స్పందన మేరకు కాగ్నిజెంట్‌ వివరణ ఇచ్చేందుకు రెండువారాల గడువు కోరింది. గతనెలలోనే పారిశ్రామిక సంఘాల సమాఖ్య అసోచామ్‌ అంచనాల ప్రకారం హెచ్‌వన్‌బి వీసా కఠినతరం అయినప్పటి నుంచి ఐటి దిగ్గజాలు తమతమ వ్యూహాలకు ప్రాథమిక మార్పులు చేసుకుంటున్నాయని పేర్కొంది. కొన్ని కంపెనీలు ఖర్చు లు తగ్గించుకోవడం, మరికొన్ని కంపెనీలు విదేశాల్లో పనిచేస్తున్న వారిని ఇళ్లకు పంపించడం, మరి కొన్ని కంపెనీలు వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకోవడం వంటివి చేస్తున్నా యని అసోచామ్‌ వెల్లడించింది.

అలాగే ఐటిరంగ నిపుణుల అంచ నాల ప్రకారం మరో 56వేల ఉద్యో గాలు ప్రస్తుతం డోలాయమాన స్థితి లో ఉన్నట్లు అంచనా. ఇదిలా ఉండగా తమిళనాడు లో ప్రభుత్వానికి ఐటి ఉద్యోగసంఘాలు ఫిర్యాదులు చేసాయి. చెన్నై కోయింబత్తూరు, బెంగళూరు, పుణె, ముంబై, కోల్‌ కతా వంటి నగరాల నుంచి కూడా భారీ ఎత్తున ప్రచారంచేసి ఉద్యోగులను సమీకరిం చాలని నిర్ణయించాయి. కంపెనీలకు ప్రభుత్వాలు భారీ ఎత్తున రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తుంటే కంపెనీలు మాత్రం ఉద్యోగులను ఏకపక్షంగా తొల గిస్తున్నాయని ఫైట్‌ ఫోరమ్‌ పేర్కొంటున్నది. లాభా లను పెంచుకునేందుకు యాంత్రీకరణ అని చెపుతూ ఉద్యోగులను తగ్గించివేస్తున్నాయని, ఎన్‌డిఎ ప్రభు త్వం ప్రవేశపెట్టిన కోటి మందికి ఉపాధి లక్ష్యం ఎలా నెరవేరుతుందని ప్రశ్నిస్తున్నాయి.

అయితే కాగ్నిజెంట్‌ కంపెనీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను రెండువారాల వ్యవధికోరింది. ఐటిరంగ అంచనాల ను పరిశీలిస్తే 56వేల ఉద్యోగాలుప్రమాదంలో ఉన్న ట్లు చెపుతున్నారు. ఇన్ఫోసిస్‌, టిసిఎస్‌లు మాత్రం ఈ పరిస్థితికి తాము బాధ్యులంకాదని చెపుతు న్నాయి. ఏడు అతిపెద్ద ఐటిసంస్థలు భారత్‌లో 56 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన చెపుతున్నాయి. వీటిలో విప్రో, టెక్‌ మహీంద్ర, హెచ్‌సిఎల్‌ టెక్నాల జీస్‌, కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌, డిఎక్స్‌సి టెక్నాలజీ, ఫ్రాన్స్‌క్యాప్‌జెమిని ఎస్‌ఎ కంపెనీలున్నా యి. వీటిలో టిసిఎస్‌ మాత్రం తమ నుంచి ఎలాంటి ఉద్వాసనలు ఉండవని, ఇప్పటివరకూ లేవని స్పష్టంచేసింది. ప్రతి ఏటా నియామకాలు పెరుగుతూనే ఉన్నాయని టిసిఎస్‌ వెల్లడించింది.