పద్మశ్రీతో విరిసిన తెలుగు తేజం

K.SRIKANTH
పద్మశ్రీతో విరిసిన తెలుగు తేజం

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. ఇందులో క్రీడల విభాగంలో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌ను పద్మశ్రీ అవార్డు వరించింది. ఇండోనేషియా సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ బ్యా డ్మింటన్‌ టైటిల్‌తో పాటు మరెన్నో విజయా లను శ్రీకాంత్‌ సొంతం చేసుకున్నాడు. గుంటూరు జిల్లాలోని చంద్రమౌళినగర్‌కు చెంది న శ్రీకాంత్‌ హైదరాబాద్‌లోని గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలో శిక్షణ పొందాడు. 2014లో జరిగిన చైనా ఓపెన్‌ సిరీస్‌ ప్రీమి యర్‌లో విజేతగా నిలిచిన తొలి భారతీ యుడిగా కిదాంబి గుర్తింపు సాధించాడు. 201 4 నవంబర్‌ 16న ప్రపంచ బ్యాడ్మిం టన్‌లో సూపర్‌ డాన్‌గా పేరొందిన లిన్‌ డాన్‌ణు 21-19, 21-17తేడాతో ఓడించి 2014 చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమి యర్‌ గెలుచుకు న్నాడు. అప్పటి నుంచి శ్రీకాంత్‌ భారత పురు షుల బ్యాడ్మింటన్‌ విభా గంలో ఎదురులేని క్రీడాకారుడిగా రాణిస్తూ దేశ కీర్తిని శిఖరాగ్రాన నిలపుతున్నాడు. శ్రీకాంత్‌కు పద్మశ్రీ లభిం చడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆనందం నెలకొంది.