పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌: తెలంగాణలో పదో తరగతి పరీక్షల తేదీలను ఎస్‌ఎస్‌సీ బోర్టు ప్రకటించింది. మే 17వ తేదే నుండి మే 26 వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే ఈ సంవత్సరం 11 పేపర్ల విధానానికి తెర దించుతూ పలు మార్పులు చేసిన విద్యా శాఖ కేవలం 6 పరీక్షలనే నిర్వహించనుంది. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్ష సమయం కేటాయించింది.

పరీక్ష షెడ్యూల్‌ ఇలా..

  • మే 17న ప్రథమ భాష (తెలుగు)
  • 18న ద్వితీయ భాష (హిందీ)
  • మే 19న ఇంగ్లిష్‌ పేపర్‌
  • మే 20న మ్యాథ్స్‌ (గణితం)
  • మే 21న సామాన్యశాస్తం
  • మే 22న సాంఘికశాస్త్రం పరీక్షలుంటాయి.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల