పదేళ్లు నిండిన బాలికలు జీన్స్‌ వేసుకోకూడదట!

jeans
jeans

అలీరాజ్‌పూర్‌: ఆధునిక పోకడలను అనుసరించి ప్రజల వస్త్రధారణలోనూ మార్పులొచ్చాయి. సంప్రదాయ దుస్తులు ధరించడాన్ని వేడుకలప్పుడు, పండగలప్పుడు మినహా మిగతా రోజుల్లో చూడటం గగనమైపోయింది. కానీ, మధ్యప్రదేశ్‌లోని మాలి తెగకు చెందిన పెద్దలు మాత్రం ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పదేళ్లు దాటిన బాలికలు జీన్స్‌ ధరించడాన్ని నిషేధించారు. ఈ నిబంధనను దేవీ నవరాత్రుల నుంచి అమల్లోకి తీసుకురానున్నారు. నవరాత్రుల్లో భాగంగా మాలి తెగ గర్బా వేడుకను ఘనంగా నిర్వహిస్తుంది. వేడుక సందర్భంగా వందలాది మహిళలు, యువతులు గర్బా నృత్యం చేస్తారు. అయితే, ఈ వేడుకలో పాల్గొనే మహిళలు జీన్స్‌ ధరించరాదంటూ నిబంధన విధించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనే కార్యక్రమం కావడంతో మహిళల పట్ల ఎవరూ అసభ్యంగా ప్రవర్తించకుండా ఉండేందుకు ఈ నిబంధన తీసుకొచ్చారు.