పది నెలల గరిష్టానికి చేరిన పుత్తడి

Gold Price
Gold Price

న్యూఢిల్లీ: అమెరికా, ఉత్తరకొరియా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు, హరికేన్‌ ప్రభావంతో శుక్రవారం నాడు పుత్తడి ధర పది నెలల గరిష్టానికి  పెరగడం జరిగింది. శుక్రవారం ఒక్కరోజే రూ.990లు పెరిగింది. దీంతో పది గ్రాముల పుత్తడి ధర రూ.31,350 కి చేరుకుంది. పుత్తడి బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. తయారిదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో బంగారం ధర పెరిగినట్లు మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర పెరగడంతో డాలర్‌ విలువ కూడా పెరిగింది.