పదకొండు సింహాలు మత్యువాత!

LIONS
LIONS

రాజ్‌కోట్‌: గుజరాత్‌లోని ఆమ్రేలి జిల్లాలోని రాజులా అటవీ ప్రాంతంలో కొన్ని సింహాల కళేబరాలు లభ్యమయ్యాయి. అదే రోజు దల్ఖనియా రేంజ్‌ ప్రాంతంలో మరో మూడు సింహాల కళేబరాలు దొరికాయి. మొత్తం 11 సింహాలు మృత్యువాత పడ్డాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. మృతి గల కారణాలను తెలుసుకేనేందుకు వాటి నమూనాలను పోస్టుమార్టం నివేదిక కోసం పంపించాం అని అటవీశాఖ అధికారి తెలిపారు. ప్రాథమిక నివేదిక ప్రకారం మృతి చెందిన 11 సింహాలలో ఎనిమిది ఘర్షణ పడటం కారణంగా అంతర్గత భాగాల్లో తీవ్ర గాయాలు కావడం వల్ల మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు ఫారెస్టు డిపార్ట్‌మెంటు అడిషనల్‌ చీఫ్‌ సెక్రటరీ తెలిపారు.