పథకాలున్నా గ్రామాలకు వెలుగులు సున్నా

Power Generation
Power Generation

పథకాలున్నా గ్రామాలకు వెలుగులు సున్నా

దేశంలో విద్యుత్‌ స్థాపక సామర్థ్యం, ఉత్పత్తి బాగా పె రిగినా, విద్యుత్తులోటును చాలా వరకు పరిష్కరిం చగలిగినా, ఎంతో కొంత విద్యుత్‌ మిగిలి ఉంటుం దని అంచనా వేసినా ఇవన్నీ క్షేత్రస్థాయిలో సమస్యల చీకట్లను తొల గించలేకపోతున్నాయి. 2018 డిసెంబర్‌ నాటికి వంద శాతం ఇళ్లకు విద్యుత్‌ సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెటు ్టకుంది. కానీ ఆ మేరకు లక్ష్యం సాధ్యమవ్ఞతుందా అన్నది సంశయ ంగా మారింది. నిరంతరం విద్యుత్తు సరఫరా చేయాలని రాష్ట్రాలు పోటీపడుతున్న నేపథ్యంలో అసలు విద్యుత్తు లేక అంధకారంలో మగ్గుతున్న గ్రామాలు ఇళ్లు ఉన్నా యంటే ఇది దేశానికే అవమానం. దేశంలో దాదాపు 23.5 కోట్ల మందికి విద్యుత్‌ అందుబాటులో లేదని అంచనాగా తెలుస్తోంది. ఈ అంచనా కన్నా వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువేఉండవచ్చు.దేశంలో విద్యుత్‌లేని గ్రామాలు 18,452 ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.

2005లో గ్రామాల్లోని ప్రతి ఇంటికి విద్యుత్‌ సౌకర్యం కల్పించడానికి రాజీవ్‌ గాంధీ గ్రామీణ విద్యుద్ధీకరణ కార్యక్రమం, అలాగే 2014 డిసెంబర్‌లో దీన్‌దయాళ్ల ఉపాధ్యాయ గ్రామజ్యోతి పథకం ప్రారంభమైనా అనుకున్న లక్ష్యం కొంతవరకు నెరవేరింది తప్ప ఇంకా పూర్తికాలేదు. పథకాల పేర్లు మారుతున్నాయి. కానీ ఫలితాలు సాధించడంలో వేగం కన్పించడం లేదు. ఒడిశా, జార్ఖండ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం, బీహార్‌ వంటి రాష్ట్రాల్లో 7వేలకు పైగా గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించే విష యంలో ఇంకా వెనుకబాటే కొనసాగుతోంది.

ఈ రాష్ట్రాల్లో మారు మూల గ్రామాల్లో విద్యుత్‌ సౌకర్యం కల్పించడం ఎన్నో వ్యయ ప్ర యాసలతో కూడుకున్న పని. నివాసాలు ఒకచోట ఉండక అక్కడక్క డ విసిరివేసినట్టు ఉండడంతో ఖర్చుఎక్కువగా భరించ వలసి వస్తో ంది. ఒకవేళ ఎంత ఖర్చయినా సరే విద్యుత్‌ సరఫరాకు తగిన ఏ ర్పాట్లుచేసినా వీటి నిర్వహణ మరింత కష్టసాధ్యమవ్ఞతోంది. ఇటువ ంటి గ్రామాలకు పునరుత్పాదక ఇంధన వనరుల సామ ర్థ్యమే శర ణ్యమనిపిస్తోంది. దేశంలోజలవిద్యుత్‌ సామర్థ్యం 43,112 మెగావాట్లు కాగా, పు నరుత్పాదక ఇంధన వనరుల సామర్థ్యం 44, 237 మెగావా ట్లు.పునరుత్పాదక ఇంధనవనరుల్లో పవన విద్యుత్‌ 27,151 మెగా వాట్లు. సౌరవిద్యుత్తు 8000 మెగావాట్లు. మిగిలింది బయోమాస్‌ తదితరాల నుంచి వచ్చే విద్యుత్తు. పవన విద్యుత్తు కన్నా సౌరవిద్యు త్‌ ద్వారా 40వేల మెగావాట్లు సాధించాలని ఆశయంగా ప్రభుత్వం పెట్టుకుంది. సెప్టెంబర్‌ నాటికి 1020 మెగావాట్లకు సోలార్‌ విద్యుత్‌ సామర్థ్యం చేరుకున్నట్టు తెలుస్తోంది.

సౌరవిద్యుత్‌లో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ 132 మెగావాట్ల సోలార్‌ రూఫ్‌టాప్‌ యూనిట్లు ఉన్నాయి. రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాలు తరువాత స్థానాల్లో నిలిచాయి. ఉభయతెలుగు రాష్ట్రాల్లో మొత్తం 57 మెగావాట్ల సోలార్‌ రూఫ్‌టాప్‌ యూనిట్ల సామర్థ్యం ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి ప్రాధాన్యం ఇస్తూ కేంద్రం ప్రత్యేక బడ్జెట్‌లో 600 కోట్ల నుంచి 5000 కోట్లకు అంచనా పెంచింది. ఈ మేరకు గృహ వినియోగదారులకు, విద్యాసంస్థలకు, ఆస్పత్రులకు తదితర సంస్థలకు కేంద్ర రాయితీని 70 శాతం వరకు ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ఇవ్వడానికి యత్నిస్తోంది.

మున్ముందు బొగ్గుఆధారిత విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్వహణ సామర్థ్యం కష్టం కావచ్చుకానీ, సౌరవిద్యుత్‌కు అలాంటి గడ్డు పరిస్థితి ఉండ బోదని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 2015 ఆగస్టు 15న వెయ్యి రోజుల్లో విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తామన్న కేంద్రం ఎంతవరకు తన లక్ష్యాన్ని పూర్తి చేయగలుగుతుందో చూడవల సిందే.తెలంగాణలో విద్యుత్‌ నిర్వహణలో లోపాలు కనిపిస్తున్నాయి

విద్యుత్తు ఉత్పత్తి పంపిణీల్లో దేశంలోనే ఉన్నతంగా తెలంగాణ ఉందని టిఎస్‌జెన్‌కో, ట్రాన్స్‌కో యంత్రాంగం ప్రకటిస్తున్నా బిల్లింగ్‌, ఖర్చుల విషయంలో కొంత తేడా కనిపిస్తోంది. కొద్దిరోజుల్లో మును గూరు, కొత్తగూడెం కేంద్రా ల్లో ఉత్పత్తి అందుబాటులోకి వస్తుందని రెండుమూడేళ్లలో రాష్ట్రం మిగులు విద్యుత్తును సాధిస్తుందని ఆశిస్తున్నారు. 2011జనాభా లెక్కల ప్రకారం 5,97,464 రెవెన్యూ గ్రామాల్లో 2015 ఫిబ్రవరి నాటికి 5,79,016 గ్రామాలు విద్యు ద్ధీకరణ చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది బాగా ఉన్నట్లు కనిపించినా కేంద్రం ధ్రువీకరణ కోరిన 24 రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోని 15 కోట్లకు పైగా ఇళ్లలో విద్యుద్దీకరణ పూర్తి చేసుకున్న ఇళ్లు 9.09 కోట్లు మాత్రమే ఉండడం వేదన కలిగిస్తోంది. ఈ కోణంలో తెలంగాణలో 11 లక్షలకు పైగా ఇళ్లకు, ఆంధ్రలోని 20 లక్షల కుపైగా గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు అసలు విద్యుత్‌ కనెక్షన్‌ లేదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

– కనుకుల యాదగిరి రెడ్డి