పథకాలపై ప్రజలలో అసంతృప్తి ఉంది

AP CM BABU
AP CM BABU

రాజాం: ఏపి రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే దాదాపు రూ. 24 వేల కోట్ల రుణమాఫీ చేసినట్లు ఏపి సియం చంద్రబాబు అన్నారు. సంక్రాంతి తర్వాత మిగిలిన రుణమాఫీని పూర్తి చేస్తామన్నారు. శనివారం ఆయన శ్రీకాకుళం జిల్లా రాజాం మండలంలోని పొగిరిలో నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో మాట్లాడారు. వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేస్తున్నామని ,ఇప్పటికే వృద్ధి సాధించామని అన్నారు. వంశధార, నాగావళి నదలను అనుసంధానం చేస్తున్నామని అన్నారు. 1.30 కోట్ల మందికి భూ ఆరోగ్య కార్డులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలలో అసంతృప్తి ఉందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు , తదితరులు పాల్గొన్నారు.