పతంజలికి జీఎస్టీ దెబ్బ

 

BABA RAMDEV
BABA RAMDEV

ముంబయి: పతంజలికి తొలిసారిగా భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎన్టీయే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంఆ తీసుకొచ్చిన జీఎస్ట్‌, అలాగే వెల్లువలా వస్తున్న విదేశి కంపెలునలు పోటిగా రావడంతో పతంజలి అమ్మకాల్లో వెనుకబడిది. సీఏఆర్‌ నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈఏడాది వెయ్యికోట్ల రూపాయలు కోల్పోయింది. బాబా రాందేవ్ బాబా మార్గదర్శనంలో.. హరిద్వార్ కేంద్రంగా నడుస్తున్న పతంజలి కంపెనీ 201617లో రూ.9030 కోట్లు అమ్మకాలు సాధించగా.. 201718లో రూ.8135కోట్లుకు పడిపోయింది. లాభాల్లోనూ పతంజలి వెనుకబాటులోనే ఉంది. గతంలో లాభాలు రూ.1190 కోట్లు ఉండగా.. ఈ ఏడాది సగానికి సగం పడిపోయి రూ.529 కోట్లకు చేరింది. మార్కెట్‌లో పతంజలి వెనకబాటుకు జీఎస్టీ, విదేశీ కంపెనీలను కారణాలుగా చెబుతున్నారు విశ్లేషకులు.