పడవ పాపం తలాపిడికెడు

Boat Dead Bodies
Boat Dead Bodies

పడవ పాపం తలాపిడికెడు

ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఆహ్లాదకరంగా బంధుమిత్రులతో గడపాలనే కోరికలతో బయ లుదేరిన పర్యాటకులను బోటురూపంలో మృ త్యువు కబళించింది. ఒకరుకాదు, ఇద్దరుకాదు ఏకంగా 21మందిని పొట్టనపెట్టుకుంది. మరో ఇద్దరికోసం గాలిం పులు జరుగుతున్నాయి. ఆసుపత్రిలో చికిత్సపొందు తున్న వారిలో ఒకరిపరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు అధికారవర్గాలే చెపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ విజయవాడ వద్ద కృష్ణానదిలో ఆదివారం సాయంత్రం పడవ బోల్తా పడటంతో పెనువిషాదం చోటుచేసుకుంది.

విజయవాడ కు పది కిలోమీటర్లదూరంలోవ్ఞన్న ఇబ్రహీంపట్నం పవి త్ర సంగమంవద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయం లో పడవలో నిబంధనలకు విరుద్ధంగా సిబ్బందితోసహా 40మందికిపైగా ఉన్నారు. నవ్యాంధ్రను తిలకించేందుకు ఇటీవలి కాలంలో సందర్శకుల రద్దీపెరిగింది. సెలవు రో జుల్లో మరింత ఎక్కువగా రద్దీ ఉంటున్నది. ఆదివారం ఒంగోలు వాకర్స్‌క్లబ్‌కు చెందిన 60మందికిపైగా బృం దం రెండుప్రైవేటు బస్సుల్లో అమరావతి చేరుకుని ఆ తర్వాత విజయవాడలోని పున్నమి ఘాట్‌నుంచి పవిత్ర సంగమంవద్ద నిత్యహారతి తిలకించేందుకువెళ్లాలనే వారి కోరిక ప్రాణాలను బలితీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ టూరిజం శాఖకుచెందిన పడవ అందుబాటులో లేకపోవడంతో ప్రై వేటు సంస్థకు చెందిన ఒక బోటులో పయనమయ్యారు.

గోదావరి-కృష్ణ నీరు కలయికవద్ద బోటుకుదుపునకు గురి కావడం గోదావరి నీటితో వచ్చిన ఒండ్రుమట్టి అక్కడ కుప్పలుగాఏర్పడి బోటుకు తగలడంతో ఒకవైపునకు ఒరి గింది. భయంతో ప్రయాణీకులంతాబోటులోనే ఒక పక్క కువెళ్లడంతో పడవబోల్తాపడినట్లు చెపుతున్నారు. అందు లోనూ డ్రైవరు కొత్తకావడం నీటిప్రవాహానికి అడ్డంగా బో టునుతిప్పడంతో ఆ నీటివేగం బోటునుతిప్పేసిందని కూ డా మరొకవాదనవినిపిస్తున్నది. ఏదేమైనా విహారయాత్ర కు వచ్చిన అమాయకులు బలైపోయారు. యధావిధిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. ప్రధా న మంత్రి నరేంద్ర మోడీ ఈ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాం తిని వ్యక్తంచేసి మృతిచెందిన కుటుంబాలకు సానుభూతి వ్యక్తంచేశారు. ఎపిముఖ్యమంత్రిచంద్రబాబు సోమవారం సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

అందుకు బాధ్యులైనవారిపై చర్యలుతీసుకుంటామనికూ డా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ మృతిచెందిన వారికి సంతాపం వ్యక్తంచేస్తూ రెండునిమిషాలు మౌనం కూడా పాటించింది. పదిలక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషి యా ప్రభుత్వం ప్రకటించింది. ఎంతఎక్స్‌గ్రేషియా ఇచ్చి నా ఎన్నిఓదార్పు మాటలుచెప్పినా మరెంత సానుభూతి ప్రకటించినా పోయినప్రాణాలు తిరిగిరావు. ఆ కుటుంబా ల్లోని దుఃఖాన్ని ఎవరూ పోగొట్టలేరు. ఈ ప్రమాదంలో కుమార్తె మరణించిందనితెలిసిన ఓ మాతృమూర్తి గుండె ఆగిపోయిన సంఘటన ఎంతటిబండరాతి హృదయాల నైనా కరిగిస్తున్నది. అసలు ఈ ప్రమాదానికి కారకు లెవరు? కారణాలేమిటి? లోపమెక్కడ జరిగిందనే ప్రాథ మిక దర్యాప్తులో అనేకవిషయాలు వెలుగుచూస్తున్నాయి.

అసలు ఆ పడవకు జలరవాణా అనుమతిలేదు. ఆది వారం ఉదయమే అక్కడికి చేరుకున్నట్లు చెపుతున్నారు. కేవలం 20మంది సరిపోయే ఈ పడవలో రెట్టింపు స్థాయిలోప్రయాణీకులను ఎక్కించారు.వాస్తవంగా ఇలాం టి ప్రాంతాల్లో పడవలు తిప్పాలంటే తొలుత పర్యాటక శాఖ, ఆతర్వాత జలవనరులశాఖ, చివరిగా బోటులో ఉన్న సౌకర్యాలు లైఫ్‌జాకెట్లు వంటి పరికరాలు గురించి అగ్నిమాపకశాఖ పరిశీలించిన తర్వాతనే అనుమతులిస్తా రు. ఒక దశలో ఆ ఘాట్‌లో పార్కింగ్‌ ప్రదేశంలో ఉన్న ఈ పడవను అనుమతుల్లేవంటూ స్థానిక సిబ్బంది దూ రంగా పంపినట్లు చెపుతున్నారు. అయినా అదిఅక్కడికి ఎలాచేరుకున్నది? ఎవరుఅనుమతిచ్చారు? అక్కడ జల మార్గాలు గురించి ఏమాత్రం తెలియని డ్రైవర్‌కు నడప డానికి అనుమతి ఎలాలభించింది? ఇవన్నీ జవాబులేని ప్రశ్నలే.

లైఫ్‌జాకెట్లు పడవలోఉన్నా కేవలం ఒక్క మహి ళకు మాత్రమే ఇచ్చినట్లు చెపుతున్నారు. అక్కడేకాదు ఎపి, తెలంగాణలోనూ జలరవాణాకు ఉప యోగిస్తున్న లాంచీలుమరపడవలు,నాటుపడవలు, బల్లకట్లు, పుట్టిలు అత్యంత ప్రమాదకరపరిస్థితుల్లో నడుస్తున్నాయి. పర్య వేక్షించాల్సిన కొందరధికారులు లంచాలకు ఆశపడి వాటి గురించిఏమాత్రంపట్టించుకోవడంలేదు. ముఖ్యంగా గోదా వరిలో భద్రాచలంనుండి పాపి కొండలవరకూ వెళుతున్న ప్రయాణీకులకు కనీస భద్రతలేదనే చెప్పవచ్చు. వేలాది మంది ప్రయాణిస్తున్న అన్నిబోట్లలోనూ భద్రత ప్రమా ణాలకు తిలోదకాలిస్తున్నారనే చెప్పవచ్చు. ప్లాస్టిక్‌ కుర్చీ లువేసి నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా పర్యా టకులను ఎక్కిస్తున్నారు.

హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌ లోకూడా నడిచే బోట్ల పరిస్థితి ఇందుకు భిన్నంగాలేదు. పండుగలు, సెలవులువస్తే దాదాపు ఆరేడువేలమంది హుస్సేన్‌సాగర్‌లో పర్యటిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పరిసర ప్రాంతాలను సందర్శిం చేందుకు యాత్రీకుల సంఖ్యకూడా గణనీయంగా పెరి గింది. ఇక్కడికి వచ్చినవారు కృష్ణానదిలో విహారయాత్ర కు ఉవ్విళ్లూరుతున్నారు. ఇంత పెద్దఎత్తున పర్యాటకులు తరలివస్తున్నా కనీస భద్రతానియమాలు తీసుకోవడంలో పాలకయంత్రాంగం ఘోరంగావిఫలమైందనే చెప్పవచ్చు. ఏదిఏమైనా నిరంతరంపర్యవేక్షించాల్సినపాలకులు, అధి కారుల నిర్లక్ష్యం డబ్బుకోసం బోటుయజమాన్యం కక్కుర్తి కనీసభద్రత కల్పించనిసిబ్బంది, జలమార్గంగురించి తెలి యని డ్రైవరు అందరిదీ ఈ పాపం అని చెప్పవచ్చు.

– దామెర్ల సాయిబాబ,

ఎడిటర్‌, హైదరాబాద్‌