పట్టుకురుల కోసం…

                               పట్టుకురుల కోసం…

SOFT HAIR
SOFT HAIR

అందమైన, మృదువైన, పొడవైన జుట్టు కావాలని ఆశపడని మగువ ఉండదంటే అతిశయోక్తి కాదేమో. కాస్తంత శ్రద్ధ తీసుకుని కొన్ని చిట్కాలు క్రమం తప్పకుండా పాటిస్తే మీ కేశాలను కూడా అందంగా, మృదువ్ఞగా మెరుస్తాయి. అవేమిటో తెలుసుకుందామా!
్జ రెండు అరటి పండ్లను మెత్తని గుజ్జులా చేసుకోవాలి. రెండు టేబుల్‌ స్పూన్ల తేనెను అందులో కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి, అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇది పొడిబారిన జుట్టుకు చక్కని పరిష్కారం. ఇలా చేస్తే మీ జుట్టుపట్టులా మెరుస్తుంది.
్జ వెంట్రుకలు తెల్లబడకుండా ఉండాలంటే ఉసిరికాయ రసం, నువ్ఞ్వలనూనె సమపాళ్లలో కలిపి, కాచి తలకు రాసుకోవాలి.
్జ ఒక కోడిగుడ్డులోని సొనను చిన్న గిన్నెలో వేసి బాగా చిలకరించి అందులో ఒక నిమ్మపండు రసం కలపండి. నాలుగు చెంచాల పెరుగును కూడా ఈ సొనకు కలిపి తలకు పట్టించి అరగంట సేపు ఉండండి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే మీ వెంట్రుకలు మృదువ్ఞగా, కాంతివంతంగా ఉంటాయి.
్జ కొబ్బరినూనెలో వెల్లుల్లిపాయలను ఉడికించి, వడకట్టి ప్రతిరోజూ తలకు రాస్తే తెల్లవెంట్రుకలు నల్లగా మారుతాయి.
్జ ఉసిరిపొడిని ఇనుపపాత్రలో రాత్రిపూట నానవేసి ఉదయాన్నే ఆ మిశ్రమాన్ని బ్రష్‌తో వెంట్రుకలకు పట్టించండి. అనంతరం తలకు షవర్‌ క్యాప్‌ పెట్టుకోవడం వల్ల మిశ్రమం ఒంటిమీద పడదు. గంట తర్వాత స్నానం చేస్తే సరి.
్జ ఎండలో బయటకి వెళ్లినపుడు సన్‌స్క్రీన్‌ చర్మ సంరక్షణ కోసం వాడుతుంటారు. అలాగే ఎక్కువసేపు ఎండలో తిరగాల్సి ఉన్నప్పుడు సన్‌స్క్రీన్‌ ఉన్న జుట్టు ఉత్పత్తులను వాడవచ్చు.
్జ ఎక్కువగా జుట్టురాలుతోందా ఒక ఉల్లిపాయను మెత్తగా పేస్టులా చేసుకోవాలి. దానికి చెంచాడు తేనె కలపాలి. తలకు పట్టించి గంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.
్జ ఒక కప్పు దంపుడు బియ్యానికి మూడు కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. అన్నం ఉడికిన తర్వాత బియ్యాన్ని విడిగా తీయగా వచ్చిన గంజిని చల్లారబెట్టాలి. ఈ గంజిని ఆరంగా ఆరంగా కనీసం మూడుసార్లు జుట్టుకు పట్టించాలి. తర్వాత చల్లని నీటితో శిరోజాలను శుభ్రపరుచుకోవాలి. ఇది జొన్న పీచులా పలుచగా ఉండే జుట్టును ఒత్తుగా చేస్తుంది.
్జ ఒక్కోసారి తలంతా దురద పుడుతుంది. అలాగని ఊరికే గోకుతుంటే మాడు పుండు పడుతుంది తప్ప దురద మానదు. ఇందుకు బీట్‌రూట్‌ రసం చికిత్స. అందుకు ఏం చేయాలంటే తాజా బీట్‌రూట్‌ను చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో చిక్కటి రసం తీయాలి. దీనిని నేరుగా తలకు పట్టించుకోవాలి. పావ్ఞగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయండి, జుట్టుపట్టులా మెరుస్తుంది.
్జ కొంతమంది జుట్టు జిడ్డుగా, నూనె కారుతూ ఉంటుంది. తలస్నానం చేసిన కొద్దిసేపటికే జుట్టు జిడ్డుగా తయారై రాలిపోతుంటుంది. ఇటువంటి వారు ఒకవేళ కండీషనర్‌ వాడదలుచుకుంటే పెరుగును మాత్రం వాడుకోవాలి. కండీషనర్‌ను తలకు కాకుండా వెంట్రుకల కొసలకు ప్రయోగించాలి. స్నానానికి ఉపయోగించే నీళ్లకు కొద్దిగా నిమ్మరసాన్ని చేర్చితే జిడ్డు వదులుతుంది.
్జ శీకాకాయ, పెసలు, ఉసిరి, కరివేపాకు, నిమ్మతొక్కలు, మెంతులు వీటన్నిటిని గాలికి ఆరబెట్టి, ఎండిపోసిన తరువాత విడివిడిగా పొడిచేసుకుని ఒకటిగా కలిపి తలస్నానం చూర్ణంగా వాడుకుంటే తలకు పట్టిన జిడ్డు వదిలిపోయి కేశాలు ప్రకాశవంతంగా తయారవ్ఞతాయి.
్జ జుట్టు ఆరోగ్యవంతంగా పెరగాలంటే మంచి పోషకాహారం తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా పొడవాటి జుట్టుని ఇష్టపడేవారు మరింత పొడవ్ఞ అయితే బాగుండు అనుకునేవారు. ప్రొటీన్లు ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలి. పప్పు, మజ్జిగ, గుడ్డు, పప్పు ధాన్యాలు, చికెన్‌, పన్నీర్‌, ఇవన్నీ జుట్టు పెరిగేందుకు కావలసిన పోషకాలు అందిస్తాయి.
్జ జుట్టుకి మంచి షాంపూ, కండీషనర్‌లు రాస్తూ శ్రద్ధ తీసుకుంటున్నా చుండ్రు, జుట్టు ఊడిపోవటం మొదలైన సమస్యలు వెంటాడుతుంటాయి కొంతమందిని. మీరు గుర్తించాల్సింది ఏమిటంటే జుట్టు సంరక్షణ అంటే షాంపూ కండీషనర్ల వాడకమే కాదు. మంచి సమతులాహారం తీసుకోవాలి.
్జ తడిగా ఉన్న జుట్టును దువ్వటం వల్ల జుట్టు పగిలిపోయి పీచులాగా తయారవ్ఞతుంది. దీనివల్ల జుట్టు కుదుళ్లు కూడా దెబ్బతింటాయి. ఆరిన తరువాత చిక్కు తీసుకోవడం వల్ల సులువ్ఞగా వస్తుంది. జుట్టు ఆరోగ్యానికి ఎలాంటి చిక్కూరాదు.
్జ పేలు మిమ్మల్ని చికాకు పెడుతున్నాయా వాటిని వదిలించుకోవడం చాలా తేలిక. ఎలా అంటే ఉసిరి విత్తనాల్ని పొడిచేసి దాన్ని నిమ్మరసంలో కలపాలి. వెంట్రుకల మొదళ్లకు ఆ మిశ్రమాన్ని పట్టించి అరగంట తర్వాత స్నానం చేయండి. పేల బెడద మిమ్మల్ని వీడుతుంది.
్జ పొడిబారిన కురులకు కొబ్బరినూనె, కొబ్బరి పాలు, పెరుగు తలా పావ్ఞకప్పు, ఒక గుడ్డులోని తెల్లసొన తీసుకుని, అన్నింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు ఇంకేలా పట్టించాలి. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.
్జ పొడిబారిపోయి కాంతిహీనంగా తయారైన జుట్టుతో బాధపడుతున్నట్లయితే, తాజా మెంతికూరను తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. దానికి చిక్కటి పెరుగు కలిపి తలకు పట్టించండి. అరగంట తర్వాత మంచి షాంపూతో తలస్నానం చేయండి. జుట్టు ఎంతో కోమలంగా తయారౌతుంది.
్జ బలహీనంగా పల్చగా కనిపించే జుట్టు విషయంలో మరింత శ్రద్ధ తప్పనిసరి. అందుకు బొప్పాయి, అరటిపండు ముక్కలు ఒక్కో కప్పు చొప్పున అరకప్పు యాపిల్‌ముక్కలు తీసుకోవాలి. వీటినన్నింటిని మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి. ఈ గుజ్జును బాగా వడకట్టాలి. అలా వడకట్టగా వచ్చిన రసాన్ని తలంతా పట్టించండి. తర్వాత వెచ్చని నీటితో తలస్నానం చేయాలి.