పట్టాలు తప్పిన హిరాఖండ ఎక్స్‌ప్రెస్‌:25 మంది మృతి

Hirakand
Hirakand

పట్టాలు తప్పిన హిరాఖండ ఎక్స్‌ప్రెస్‌:25 మంది మృతి

విజయనగరం: కొమరాడ మండలం కూనేరు వద్ద అర్ధరాత్రి హిరాఖండ్‌ ఎక్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది.. ప్రమాదంలో 25 మంది మృతిచెందగా, 34 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సహాయక సిబ్బంది ఆసుపత్రులకు తరలించి చికిత్సఅందిస్తున్నారు.

పట్టాలు తప్పిన 9 బోగీలు

హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇంజిన్‌ సహా 9 బోగీలు పట్టాలు తప్పాయి.. ఎస్‌8, ఎస్‌9 బోగీలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఎసి2, 3 టైర్‌ బోగీలు , 2 జనరల్‌ , ఒక లగేజీ బోగీ పట్టాలు తప్పింది.

పలురైళ్ల దారిమళ్లింపు

విజయనగరం: విజయనగరం జిల్లాఓ హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పటంతో రాయగడ భువనేశ్వర్‌ మార్గాల్లో పలు రైళ్లను అధికారులు రద్దుచేశారు.. ధన్‌బార్‌ అలెప్పి ఎక్స్‌ప్రెస్‌, హతియా యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు దారి మళ్లించారు.. టిట్లాగఢ:-రా§్‌ుపూర్‌-నాగ్‌పూర మార్గంలో పూరి-అహ్మదాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు వయా విశాఖ-విజయవాడ-నాగ్‌పూర్‌ వైపు, చెన్నై-అసన్‌సోల్‌ ఎక్స్‌ప్రెస్‌ వయా కుర్దారోడ్డు-అంగుల్‌-జార్హుగూడ వైపు, నాందేడ్‌ సంబల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ వయా కుర్దా రోడ్డు- అంగుల్‌ మీదుగా మళ్లించారు.. రాయగడ-విశాఖపట్నం, విశాఖపట్నం-కోరావుట్‌ ప్యాసింజర్‌ రైళ్లును రద్దుచేశారు. ఘటనాస్థలి నుంచి 12 బోగీలను రైల్వే సిబ్బంది రాయగడకు తరలించారు.