పచ్చదనంలో మల్కాపూర్‌ ఆదర్శం

Harish Rao
Harish Rao

తూప్రాన్‌: సియం కేసిఆర్‌ అనుకున్నట్లుగా మల్కాపూర్‌ గ్రామం పచ్చదనం, పరిశుభ్రతలో ఆదర్శంగా ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సియం కేసిఆర్‌ తూప్రాన్‌ మండలం మల్కాపూర్‌ నుంచి కంటి వెలుగు పథకం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ..మల్కాపూర్‌ నుంచి కంటి వెలుగు పథకం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇవాళ మల్కాపూర్‌లో దసరా పండుగ వాతావరణం కనిపిస్తుందని చెప్పారు. ఈ గ్రామం వంద శాతం అక్షరాస్యత వైపు దూసుకెళ్తుంది.