‘పంతం’ షూటింగ్‌ పూర్తి

GOPI CHAND
GOPI CHAND

టాలీవుడ్‌ యాక్షన్‌ స్టార్‌ హీరో గోపీచంద్‌ హీరోగా కె.చక్రవర్తి దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌ప కెకె రాధామోహన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీచంద్‌ 25వ సినిమా ఇది.. సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు , పాటలను చిత్రీకరణ కోసం యూనిట్‌ యుకె వెళ్లిన సంగతి తెలిసిందే.. ఈ ఫారిన్‌ షెడ్యూల్‌ పూర్తిచేసుకున్న చిత్రం యూనిట్‌ హైదరాబాద్‌కు చేరుకుంది.. దీంతో సినిమా షూటింగ్‌ పూర్తయింది.
రీసెంట్‌గా విడుదలైన టీజర్‌కు ట్రెమెండస్‌ రెస్సాన్‌స వస్తుంది.. ఒకవైపుకమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంటూనేమెసేజ్‌తో సినిమాను రూపొందిస్తున్నామని యూనిట్‌ వెల్లడించింది.. సినిమా ఎలా ఉంటుందో టీజర్‌లో శాంపిల్‌ చూపించారు. ఓటును ఐదువేలకు అమ్ముకుని అవినీతి లేని సమాజం కావాలి, కరెప్షన్‌ లేని కంట్రీ కావాలంటేఎక్కడి నుంచి వస్తాయి అని హీరో కోర్టులో వేసేప్రశ్న.. అందరినీ ఆలోచింపజేసేదిగా ఎమోషనల్‌గా ఉంది.. ఓవైపు మంచి మెసేజ్‌తో పాటుసినిమాలో ప్రేమ, వినోదం వంటి అంశాలు పుష్కలంగా ఉండబోతున్నట్టు టీజర్‌తో శాంపిల్‌ చూపించారు.. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.. గోపీచంద్‌ ఇప్పటి వరకు కనపడని క్యారెక్టర్‌లోసందడి చేయబోతున్నారు. యుకె షెడ్యూల్‌ చిత్రీకరణతో పాటలుపూర్తయ్యాఇ.. సినిమాకు సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి..అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి సినిమాను జూలై5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలచేయటానికి నిర్మాత కె.కె.రాధామోహన సన్నాహాలు చేస్తున్నారు.
గోపీచంద్‌ హీరోగా నటిస్తున్నఈచిత్రంలో మొహరీన్‌ నాయిక.. పృధ్వీరాజ్‌, జయప్రకాష్‌రెడ్డి తదితరులుకీలకపాత్రలు పోషిస్తున్నారు.