‘పంతం’ చేయటం నా అదృష్టం

                                 ‘పంతం’ చేయటం నా అదృష్టం

GOPI CHAND
GOPI CHAND

గోపీచంద్‌, మెహరీన్‌ హీరోహీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.చక్రవర్తి దర్శకత్వంలో కెకె రాధామోహన్‌ నిర్మించిన చిత్రం ‘పంతం.. ఫర్‌ఎ కాస్‌.. ఉప శీర్షిక.. ఈ సినిమా నేడు విడుదలవుతోంది.. ఈ సందర్భంగా హీరో గోపీచంద్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం..

లెక్కపెట్టుకుని చేయలేదు.
మన సొసైటీలో జరిగిన ఓ ఇష్యూ గురించి మాకు తెలిసినంత చెప్పటానికి ప్రయత్నించాం.. సినిమా చూసే ప్రేక్షకులు కూడ అవును మన చుట్టూ ఈ సమస్య ఉంది కదా.. దీన్ని సాల్వ్‌ చేస్తే బావుంటుంది కదా అని అన్పిస్తుంది.. నేను 25వ సినిమా ఇది అని లెక్కపెట్టుకోలేదు.. స్టోరీ అంతా వినేసిన తర్వాత చూస్తే ఇదే నా 25వ సినిమా అయ్యింది.. ప్రతి సినిమాకు ఫస్ట్‌సినిమాయే.. అయితే నా 25వ సినిమాగా ఇది సెట్‌ కావటం ఆనందంగా ఉంది.. నాన్నగారు (టి.కృష్ణ) చేసినంత పవర్‌ఫుల్‌ స్టోరీ ఎందుకు చేయలేదు అని చాలా మంది అడిగారు.. అందరికీ అలాంటి కథ నా దగ్గరకు రాలేదు అని చెబుతూ వచ్చాను.. ఇపుడు పంతం నాన్నగారి సినిమాలా ఉంటుంది.. అయితే ఇది పూర్థిస్థాయిలో అలాంటి చ్తిరం కాదు .కానీ ఓ సోషల్‌ కాజ్‌ ఇందులో ఉంది. సినిమా అనేది పవర్‌ఫుల్‌ మీడియా దాని ద్వారా ఓ మంచి చెప్తే రీచ్‌ అవుతుందనే నమ్మే వ్యక్తుల్లో నేను ఒకడిని.. ఈ సినిమాతో అ అవకాశం నాకు దక్కింది.

డైరెక్టర్‌ చక్రి గురించి:

చక్రి కథ చెప్పినుడు తనను అడిగిన మొదటి ప్రశ్న..నువ్వు కథ బాగా చెప్పావ్‌.. అంత బాగా తీయగలవా? అని ..తను నవ్వుతూ ‘మీరు నాకు చాన్స్‌ ఇస్తే తప్ప నేను చెప్పలేను సార్‌ అని అన్నాడు. తను ఆ రోజు కథను ఎలాగైతే చెప్పాడో.. ఎగ్జిక్యూషన్‌ కూడ అలాగే చేశాడు.. దీనికి ప్రసాద్‌ మూరెళ్లగారి అనుభవం కూడ తోడయ్యింది.. చక్రి , ప్రసాద్‌గారు డిస్కస్‌ చేసుకుని సినిమాను చేశారు.

నిర్మాత రాధామోహన్‌ గురించి:
నిర్మాత రాధామోహన్‌గారిని శ్రీధర్‌గారు పరిచయం చేశారు..కొత్త డైరెక్టర్‌ కదా.. ఎలా తీస్తాడోనని ఆయన ఆలోచించారు.. కథ వినండి.. మీకు నచ్చితే ముందుకు వెళదాం అన్నాను.ఆయనకు కథ నచ్చటంతో ఓ బడ్జెట్‌ ఫిక్స్‌ చేసుకుని సినిమాను పూర్తిచేశాం.. ఇపుడు నిర్మాతగారు కూడ హ్యాపీ.. రాధామోహన్‌గారు ట్రాన్స్‌పరెంట్‌.. మాటపై నిలబడే జెంటిమన్‌ ఆయన ..

ప్రతిసినిమాకు టెన్షన్‌ ఉంటుంది.
నేను చేసిన 25 సినిమాల కథలు మంచివే.. జయాపజయాలను పక్కడ పెడితే. మంచి కథలతోనే సినిమాలు చేశాను.. ఎగ్జిక్యూషన్‌ సమస్యవల్ల సినిమా సరిగా సక్సెస్‌ అయ్యిండకపోవచ్చంతే..అయితే ప్రతిసినిమా విడుదల సమయంలో టెన్షన్‌ ఎలాగూ ఉంటుంది.

డైలాగుల ప్రాధాన్యం:
ఈసినిమాకు రమేష్‌రెడ్డి, శ్రీకాంత్‌ డైలాగ్స్‌ రాశారు.. డైలాగులతో కలిసే నేను స్టోరీ విన్నాను.. సెకండాఫ్‌లో ఓ ఫేజ్‌ వచ్చినపుడు పవర్‌ఫుల్‌ డైలాగులు ఉంటాయి. టీజర్‌లో, ట్రైలర్‌లో డైలాగ్స్‌ పవర్‌ ఏంటో తెలుస్తుంది.. అలాంటి డైలాగులు చాలానే ఉన్నాయి. అలాంటి డైలాగులు ఉన్న సీన్స్‌ చేయాలని చాలా రోజులుగా కోరిక ఉండేది. అవకాశం వచ్చింది. బాగా ఎంజా§్‌ు చేసి చేశాను.

సంపత్‌ నందితో సినిమా:
సంపత్‌గారితో సినిమా ఎప్పుడైనా చేయటానికి సిద్ధమే.. ఇపుడు కథా చర్చలు జరుగుతున్నాయి.. త్వరలోనే వివరాలు తెలియజేస్తా.

తదుపరి చిత్రం:
బివిఎస్‌ఎన్‌ప్రసాద్‌ గారి నిర్మాణంలో కుమార్‌ అనే డైరెక్టర్‌తో సినిమా చేస్తున్నాను. క్లీన్‌ లవ్‌స్టోరీ .