పండ్లు కడిగి తినాలి

FRUITS11
Washing Fruits

పండ్లు కడిగి తినాలి

పండ్లు కూరగాయలను సాధ్యమైతే ప్రవహించే నీటిలో శుభ్రపరచడం ఉత్తమం. కూరగాయలపై ఉన్న మలినాలను అవసరమైతే బ్రష్‌తో శుభ్రం చేయాలి. పండ్లు, కూరగాయలు ఏ కొంచెం దెబ్బతిన్నా అందులో బ్యాక్టీరియా చేరే అవకాశం ఎక్కువ. అందుకే ఆ భాగాన్ని కోసివేయడం మంచిది. ్జ డిష్‌ క్లాత్‌లు, టవళ్లు, స్పాంజ్‌లలో ఉండే బ్యాక్టీరియాను తొలగించడానికి బ్లీచింగ్‌ నీళ్లలో నానవేస్తూ కనీసం వారానికి మూడుసార్లు శుభ్రపరచాలి. ఇవి గాలిలో బాగా ఆరేలా చూడాలి. డిష్‌ టవల్స్‌ను వాషింగ్‌ మెషిన్‌లో ఉతకడం ఎక్కువ శ్రేయస్కరం.

మాంసం, చేపల్లోంచి వచ్చే ద్రవాలను కాగితపు టవళ్లతో తుడిచి వెంటనే వాటిని చెత్తబుట్టలో వేయాలి. వాటిని వండడానికి వినియోగించిన వస్తువ్ఞలన్నిటినీ వేడి సబ్బు నీటితో శుభ్రం చేయాలి. ్జ చేపలు కోయడానికి వినియోగించిన ప్రతిసారీ, కత్తిపీటను వేడిగా ఉన్న సబ్బునీటితో బాగా కడగాలి. ఆ తరువాత గాలిలో ఆరబెట్టడమో లేదా కాగితపు టవల్‌తో చుట్టడమో చేయాలి. క్లోరిన్‌ బ్లీచ్‌ ద్రావణాన్ని నీటిలో కలిపి శుభ్రం చేస్తే మరింత సురక్షితం. కత్తిపీట బాగా అరిగిపోయి, శుభ్రం చేయడం కష్టమైపోతున్న దశలో కత్తిపీటను మార్చివేయడం ఉత్తమం.

లోపల పడిన ద్రవాలను వెంటనే శుభ్రం చేయాలి. రిఫ్రిజిరేటర్‌లోని భాగాలను వేడిగా ఉన్న సబ్బునీటితో కడగాలి. అందులో నిలువ చేసిన పదార్థాలను వారం తరువాత పారవేయాలి.