పండుగ రోజుకూడా పాండ్య డల్‌గా ఉన్నాడు

pandya
pandya

సూరత్‌: ఓ టివి కార్యక్రమంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన క్రికెటర్లు హార్ధిక్‌ పాండ్య, కేఎల్‌ రాహుల్‌ ఆస్ట్రేలియాలో జరుగుతున్న వన్డేలకు దూరమయ్యారు. ఈ ఘటనతో పాండ్య చాలా డిస్టర్బ్‌ అయ్యాడు. ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా పాండ్య భయపడుతున్నాడని తండ్రి హిమాన్షు మీడియా ద్వారా వెల్లడించారు. కనీసం ఫోన్‌ కాల్స్‌ కూడా ఎత్తడంలేదని తెలిపారు. సంక్రాంతి పండుగ రోజు కూడా డల్‌గా ఉన్నాడు. పాండ్యకు పతంగులు ఎగరేయడం అంటే చాలా సరదా, ఇప్పుడు ఇంట్లో ఉండికూడా పతంగులు ఎగురవేయడానికి ఇష్టపడటం లేదు. బిసిసిఐ సస్పెండ్‌ చేయడంతో బాధపడుతున్నాడు. బిసిసిఐ తదుపరి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం అని హిమాన్షు మీడియా ద్వారా వెల్లడించారు.