పంట పొలాల్లో పులి మృత‌దేహం ల‌భ్యం

tiger
tiger

భోపాల్ః మధ్యప్రదేశ్‌లోని జైసింగ్‌నగర్‌లోని పంట పొలాల్లో పులి మృతదేహం లభ్యమైంది. పులిని ఎవరైనా చంపారా? లేదా ఏదైనా కారణాల వల్ల చనిపోయిందా? అన్న విషయం తేలాల్సి ఉంది. పులి మృతదేహాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం పులి మృతికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది.