పంటిసిరి

పంటిసిరి

Dental Care
Dental Care

ఎలాంటి పంటినొప్పి వచ్చినా మొదట డెంటిస్ట్‌ను కలవాలి. చిగుళ్లలో ఏదైనా ఇన్ఫెక్షన్‌ ఉంటే యాంటీ బయాటిక్స్‌తో చికిత్స చేస్తారు. ఒక్కోసారి ఇన్ఫెక్షన్‌ చాలా తీవ్రమైతే పంటిని రక్షించేందుకు రూట్‌కెనాల్‌ చికిత్స కూడా చేయవచ్చు

దంత సంరక్షణ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. ప్రతిరోజూ రెండుసార్లు పళ్ళు తోముకోండి. ్శ మీ డెంటిస్ట్‌ను కలిసి క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోండి. మీరు బ్రష్‌ చేసుకునేందుకు మృదువైన బ్రిజిల్స్‌ ఉన్న బ్రష్‌నే వాడండి.

దంత సంరక్షణను అందించే మంచి టూత్‌పేస్ట్‌ను ఎంచుకోండి. పైన చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకు నిలువ్ఞగా బ్రష్‌ చేసుకోండి.

బ్రష్‌ చేసుకునే సమయంలో చాలా మృదువుగా బ్రష్‌ చేసుకోండి. రఫ్‌గా బ్రష్‌ చేసుకుంటే అది మీ చిగుళ్లకు హాని చేకూర్చవచ్చు. అలాంటప్పుడు అవి త్వరగా వ్యాధుల బారినపడే అవకాశం ఉంటుంది.
మీ పంటికి బయటివైపే కాదు…లోపలివైపునా బ్రష్‌ చేసుకోవాలి. నమిలే ప్రదేశాల్లో పంటిపైన వెడల్పుగా ఉంటే ప్రాంతంలోనూ బ్రష్‌ చేసుకోవాలి.

లోపలివైపున బ్రష్‌ చేసుకోడానికి బ్రష్‌ను నిలువుగా పట్టుకొని పైకీ, కిందికీ మృదువుగా కదలించండి. కనీసం రెండు నిమిషాల పాటు బ్రష్‌ చేసుకోవాలి.

పళ్ల వెనుకభాగాన్ని నెమ్మదిగా బ్రష్‌ చేయండి.

బ్రష్‌ను ఉపయోగించే ముందు ఉప్పునీటిలో కొంచెం నానబెట్టండి. ముఖం కడుక్కోవటానికి వేడినీరును వాడండి.

నాలుకపై నున్న బ్యాక్టీరియాను తొలగించుకోడానికి కనీసం 30 సెకన్లపాటు స్క్రబ్‌ చేయండి.

బ్రషింగ్‌ తర్వాత టూత్‌బ్రష్‌ను మృదువుగా రుద్దండి.

చేత్తో చిగుళ్లపై మృదువుగా మసాజ్‌ చేసినట్లు రుద్దితే దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ప్రతిమూడు నెలలకు ఓమారు బ్రష్‌ను మార్చేయండి. లేదా బ్రిజిల్స్‌ వంగినట్లు, దెబ్బతిన్నట్లు కనిపించినా బ్రష్‌ను వెంటనే మార్చండి.

ప్రతిరోజూ పడుకోబోయే ముందు మౌత్‌వాష్‌ చేసుకోవాలి. పండ్లను శుభ్రంగా తోమాలి.