పంచాయతీ ఎన్నికలపై జోషి వీడియా కాన్ఫరెన్స్‌

Shailendra kumar joshi
Shailendra kumar joshi

హైదరాబాద్‌: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌ కే జోషి ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, సన్నద్ధతపై వీడియా కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డీజీపీ మహేందర్ రెడ్డి, ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లు, సన్నద్ధత, శాంతిభద్రతలపై చర్చించారు. పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో జరగనున్నాయి. తొలి దశ జనవరి 21న, రెండో దశ 25న, మూడో విడత పోలింగ్ జనవరి 30న నిర్వహించనున్నారు. తొలి విడుతలో 4480, రెండో విడుతలో 4137, మూడో విడుతలో 4115 పంచాయతీలకు పోలింగ్ జరగనుంది.