న‌ష్టాల‌ను చ‌విచూసిన మార్కెట్లు

stocks
stocks

ముంబైః దేశీయ మార్కెట్లు గురువారం కూడా నష్టాలను చవిచూశాయి. మార్కెట్‌ ఆద్యంతం అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు కుదేలయ్యాయి. సెన్సెక్స్‌ 170 పాయింట్లకు పైగా కోల్పోగా.. నిఫ్టీ 82 పాయింట్లు కోల్పోయింది.
ఈ ఉదయం నుంచే సూచీలు ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. 35,184 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైన బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ అమ్మకాల ఒత్తిడితో చాలా సేపు ఊగిసలాడింది. ఆ తర్వాత కాసేపటికే 100 పాయింట్లకు పైగా కోల్పోయిన సూచి ఇక ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. చివరకు 179 పాయింట్లు దిగజారి 35,038 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 82 పాయింట్లు పతనమై 10,589 వద్ద ముగిసింది.