న‌వంబ‌రులో వ‌ర్సిటీ ఉద్యోగాల భ‌ర్తీ

Career
Career

హైద‌రాబాద్ః యూనివర్సిటీ ఉద్యోగాల భర్తీ కోసం నవంబర్‌లో నోటిఫికేషన్‌ జారీ చేస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని పలు వర్సిటీల్లో 1061 పోస్టులను భర్తీ చేయాల్సి ఉందన్నారు. ఈ విషయమై వర్సిటీల వీసీలతో సోమవారం సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. కాంట్రాక్టు లెక్చరర్లకు నవంబరు నుంచి వేతనాల పెంపు వర్తిస్తుందని తెలిపారు.