న‌గ‌రంలో ఉష్ణోగ్ర‌త‌లు క‌నిష్టానికి..

snow fall in hyd
snow fall in hyd

హైద‌రాబాద్ః హైదరాబాద్‌లో ఏడేండ్ల తర్వాత రికార్డుస్థాయి కనిష్ఠ ఉష్ణోగ్రత బుధవారం నమోదైంది. 2010 డిసెంబర్ 21న నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 8.9 కాగా, మంగళవారం గరిష్ఠ ఉష్ణోగ్రత సాధారణంకంటే 1.7 తగ్గి 29.3 డిగ్రీలుగా, కనిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కంటే 6.2 డిగ్రీలకు తగ్గి 10.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్టు అధికారులు తెలిపారు. వచ్చే మూడురోజుల్లో హైదరాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 10 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు వాతావరణ కేంద్రంలో అత్యల్పంగా 6.6 కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. నాలుగేండ్లలో ఇదే రికార్డుస్థాయి అత్యల్పం. జిల్లాలో 2013 డిసెంబర్ 9న అత్యల్పంగా 5.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, ఖమ్మంలో 9 డిగ్రీలు, రామగుండంలో 10, నిజామాబాద్‌లో 11, హన్మకొండలో 12, హకీంపేటలో 13, మహబూబ్‌నగర్‌లో 14 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకోవడంతో ఉదయం వేళ వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.