న్యూ ఫ్యాషన్‌ ట్రెండ్‌ యొల్లేట్‌

HOLLYWOOD1
HOLLYWOOD1

న్యూ ఫ్యాషన్‌ ట్రెండ్‌ యొల్లేట్‌

ఫ్యాషన్‌, ట్రెండ్‌, ఫిట్‌నెస్‌ కొత్త ఏదైనా వెల్‌కమ్‌ పలకడానికి కుర్ర కారు సదా సిద్ధం. ఆ వూపులో మొదలైందే యొల్లెట్‌. ఈ నయా ట్రెండ్‌కి చిరునామా ఎక్కడంటే అమెరికా వైపు చూడాల్సిందే. ఎల్‌బీకన్‌ అనే నృత్య శిక్షకురాలు అక్కడ బాగా ఫేమస్‌. ఇరవై ఏళ్లుగా డ్యాన్స్‌, ఫిట్‌నెట్‌ని కలిపేసి కొత్త ట్రెండ్స్‌ని సృష్టిస్తున్న సెలెబ్రెటీ శిక్షకురామె. రెండేళ్ల కిందట బ్యాలెట్‌, యోగాల్ని కలిపి యొల్లెట్‌గా మార్చేసింది. మనకే సొంతమైన యోగా పవర్‌యోగా, న్యూడ్‌యోగా, సర్ఫిం్‌ యోగా, రూఫ్‌టాప్‌ యోగా అంటూ భిన్నరూపాల్లో ఇది వరకే సందడి చేస్తూనే ఉంది. ఇదే ఒరవడిలో యోగాతో వచ్చే లాభాలు, బ్యాలెడ్‌ నృత్యరీతుల్ని కలగలిపితే మొదలైందే యొల్లెట్‌, మొదట్లో వ్యాపార వర్గాల్లోని యూత్‌ని టార్గెట్‌ చేసి రూపొందించినా త్వరలోనే సాధారణ యువతని ఆకట్టుకునే సక్సెస్‌ ఫిట్‌నెస్‌ ట్రెండ్‌గా మారింది. ఇప్పుడు కస్‌ దగ్గ ఒక్క క్లాసు ట్రెయినింగ్‌ తీసుకోవాలన్నా కనీసం వందడాలర్లు చెల్లిం చాల్సిందే. సాధారణ యొల్లెట్‌ క్లాసు సమయం గంట. ఇందులో అరగంట బ్యాలెట్‌ స్టెప్పులతో చిందేస్తారు. అలసిసొలసిన శరీరాలు తర్వాత మరో అరగంట యోగాసనాలతో సేద తీరతాయి.
డ్యాన్స్‌ శరీరానికి వ్యాయామం అయితే, యోగా మనసుని ఒత్తిడిని దూరం చేసే మంత్రంలా పనిచేస్తుందని శిక్షకులు చెప్పే మాట. అందుకే యొల్లె ట్‌లో సర్వాంగాసనం, అర్థచంద్ర, భుజంగ, భరధ్వాజ, మకర, సిద్ధా, శవ, పద్మలాంటి తేలికపాటి ఆసనాలకే చోటిస్తారు. యొల్లెట్‌లో ఒక స్థాయికి చేరాక ఈ రెండు ఫామ్స్‌ని మిక్స్‌ చేసిన స్టెప్స్‌లో ప్రయత్నిం చొచ్చు. అమెరికా, యూరోప్‌లో పాపులర్‌ అయిన ఈ ట్రెండ్‌ ముంబై, ఢిల్లీ లాంటి మెట్రో నగరాల్లో ఇప్పుడిప్పుడే మొదలవ్ఞతోంది. ఫిట్‌నెస్‌ కోసం తపించే కుర్రకారు అందులోనూ అమ్మాయిలు ఈ ధోరణిని అందిపుచ్చుకుంటున్నారు. డ్యాన్స్‌, స్ట్రెచింగ్‌ల మిశ్రమమైన యొల్లెట్‌తో లాభాలు బోలెడు. శరీరంలో పేరుకుపోయిన కొవ్ఞ్వ, అధిక కేలరీలను తక్కువ సమయంలోనే కరిగించేస్తుంది.
గంట వర్కవ్ఞట్‌లో 500 కేలరీలు కరుగుతాయి. బరువ్ఞ తగ్గాలనుకేవాళ్లకి ఇది చక్కని వ్యాయామం. ఇక యోగా సహజంగనే ఒత్తిడి తగ్గించే సాధనం. కస్‌ మాటల్లో చెప్పాలంటే బరువ్ఞ తగ్గి శరీరాకృతి మెరుగు పడాలనుకుటే యొల్లెట్‌ని మించిన వర్కవ్ఞట్‌ లేదు. పైగా శరీరం బ్యాలెన్స్‌తో అదుపు లో ఉంటుంది. మానసిక ప్రశాంతత. శ్వాసకోసం ఇబ్బందులు రావ్ఞ. కొన్నిరకాల నొప్పులూ తగ్గించుచ్చు. తరచూ సాధన చేస్తుంటే నాజూకైన షేప్‌ సొంతమవ్ఞతుందట. ఇంట్లోనే సాధన: యోగాతో ఎన్ని ట్రెండ్స్‌ అయినా సృష్టించొచ్చు అనడానికి నిదర్శనం యొల్లెట్‌. పాశ్చాత్య దేశాల్లో పాపులరైన యొల్లెట్‌ ఇప్పుడిప్పుడే ఇండియాలో అడుగు పెడుతోంది. క్రమం తప్పకుండా సాధన చేస్తే దీనిపై త్వరలోనే పట్టు సాధించొచ్చు. ఫిట్‌నెస్‌ కోసం తపించే యూత్‌కి సరికొత్త ట్రెండ్‌. కొన్నాళ్ల శిక్షణతో సొంతంగా ఇంట్లో నే ధన చేయొచ్చు. ఈ వ్యాయామానికి తీసుకునే ఆహారమూ ముఖ్య మే. సహజంగా ఆకుకూరలు, కూరగాయలతో తయారు చేసిన డైట్‌ అయితే బాగుంటుంది.