న్యూయర్ లక్ష్యంగా ‘ఇన్సిడెంట్ ఫ్రీ…యాక్సిడెంట్ ఫ్రీ ‘

sajjanar, cyberabad cp
sajjanar, cyberabad cp

హైద‌రాబాద్ః నూతన సంవత్సర వేడుకల్లో ఏ చిన్న అపశృతులు, అవాంఛనీయ ఘటనలు, రోడ్డు ప్రమాదాలు లేకుండా ఆనందోత్సహాల్లో జరుపుకునేందుకు సైబరాబాద్ పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇన్సిడెంట్ ఫ్రీ…యాక్సిడెంట్ ఫ్రీ న్యూయర్ లక్ష్యంగా వేడుకలను సంతోషంగా జరుపుకునేందుకు సైబరాబాద్ సీపీ సజ్జనార్ పలు మార్గదర్శకాలను విడుదల చేశారు.
* నూతన సంవత్సర వేడుకల అనుమతుల కోసం 7 రోజుల ముందుగానే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వెబ్‌సైట్‌లోని https://eservices.cyberabadpolice.in లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సీపీ సైబరాబాద్ సంతకంతో కూడిన అనుమతిని పొందాలి.
* ఆహ్వాన పత్రికలు, పాసులు ఉన్న వారినే వేడుకలకు అనుమతించాలి. ఇతరులను అనుమతించొద్దు. దరఖాస్తు సమయంలో వేడుకలకు ఎంతమంది హాజరవుతున్నారో స్పష్టంగా ఉండాలి.
* డిసెంబర్ 31 వేడుకలకు రాత్రి 8 నుంచి 1గంట వరకు అనుమతి ఉంటుంది.
* దంపతులు, కుటుంబ సభ్యులతో వచ్చే వారిని వేడుకులకు అనుమతించాలి. ఒంటరిగా వచ్చే వారికి అనుమతి ఉండదు.
* వేడుకల్లో గేమింగ్ వంటి చట్టవ్యతిరేక ఆటలను నిర్వహించరాదు.
* డీజేలకు అనుమతి లేదు. 45 డెసిబెల్స్ మించి శబ్ధం ఉండకూడదు.
* నగ్న, అర్ధనగ్న నృత్యాలు నిషేధం
* అశ్లీల ఫొటోలు, దృశ్యాలను ప్రదర్శించొద్దు
* అనుమతి లేకుండా మద్యం సరఫరా చేయొద్దు
* ప్రజలకు ప్రమాదం కలిగించే అంశాలను వేడుకల్లో నిర్వహించొద్దు
* తుపాకులు తీసుకొని రావద్దు. వేడుకలకు వాటిని తీసుకురావడం నిషేధం
* వేడుకలను నిర్వహించేవారు అగ్నిమాపక శాఖ నిబంధనలను పాటించాలి
* సమయపాలనను కచ్చితంగా పాటించాలి
* వేడుకలకు వచ్చే ప్రతి ఒక్కరికి నిబంధనల గురించి ముందుగా తెలపాలి.
* వేడుకలకు సంబంధించిన (రాత్రి 8 నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు) పూర్తి వీడియో రికార్డింగ్ చేసి సీడీ రూపంలో రెండు రోజుల తర్వాత సీపీ సైబరాబాద్ కార్యాలయంలో ఇవ్వాలి.
* వేడుక ప్రాంగణంలో అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖ, ఇతర శాఖల అనుమతులకు సంబంధించిన పత్రాలను బహిరంగంగా అందుబాటులో పెట్టాలి.
* వేడుకలు జరిగే ప్రాంగణంలో సీసీ కెమెరాలు, డీఎఫ్‌ఎండీ, హెచ్‌ఎండీలను ఏర్పాటు చేయాలి.
* పటాకులను కాల్చడం నిషేధం.
* అగ్నిప్రమాదాలు తలెత్తితే వాటిని నియంత్రించేందుకు వేడుక ప్రాంగణంలో మంచినీరు, పొగను పీల్చుకునే యంత్రాలను అందుబాటులో పెట్టుకోవాలి.
* పరిశుభ్రత, పారిశుద్ధ్యాన్ని పాటించాలి.
* వేడుకలు జరిగే ప్రాంతాల్లో వెలుతురు సరిగ్గా ఉండాలి. వచ్చిన వారందరికి కూర్చునేందుకు సీట్లు ఏర్పాటు చేయాలి.
* వేడుకల నిర్వాహకులు సౌండ్ బాక్స్ స్పీకర్లను మాత్రమే వాడాలి.
* తుపాకులకు లైసెన్స్ ఉన్నా… వాటిని తీసుకురావద్దు. తీసుకువచ్చిన వారిని అనుమతించవద్దు.
* వేడుకలు జరిగే వేదికలు, ప్రాంతాల వద్ద నిర్వాహకులు పూర్తి భద్రతా చర్యలు పాటించాలి. ప్రేక్షకుల రద్దీని అదుపులో పెట్టేందుకు, వాహనాలను సరైన పద్ధతిలో పార్కింగ్ చేసుకునేందుకు అవసరమైయ్యే సెక్యూరిటీని నిర్వాహకులు కల్పించాలి.
* సౌండ్ సిస్టమ్ ఏర్పాటులో తప్పనిసరిగా సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించాలి.
* అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటే అందుకు నిర్వాహకులే బాధ్యత వహించాలి.
* వేడుకలు జరిగే ప్రాంతాన్ని స్థానిక ఎస్‌హెచ్‌ఓ ముందస్తుగా తనిఖీ చేయాలి.
* ఏవైనా గొడవలు, హింసాత్మక సంఘటనలు జరిగితే దానికి నిర్వాహకులే బాధ్యత వహించాలి. వారిపైనే కేసు నమోదవుతాయి.
* నిర్వాహకులు సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకొని భద్రతతో పాటు ట్రాఫిక్ జామ్‌లు కాకుండా చర్యలు తీసుకోవాలి.
* డిసెంబర్ 31 అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత హైవేలు, ఓఆర్‌ఆర్‌తో పాటు అన్ని రహదారులపై డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయి.
* వేడుకలకు వచ్చే వారు ప్రాంగణంలోనే వాహనాలను పార్క్ చేయాలి. రోడ్లపై నిలుపరాదు.
* రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు ఓఆర్‌ఆర్‌పై వాహనాల రాకపోకలకు అనుమతి లేదు.
* పీవీఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే, అన్ని ైఫ్లెఓవర్లపై రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు వాహనాల రాకపోకలను అనుమతించరు.
* మైనర్‌లకు మద్యం సరఫరా చేయొద్దు.
* నిబంధనలను ఉల్లంఘించే నిర్వాహకులపై చర్యలు ఉంటాయి. అదే విధంగా ఆ ప్రాంగణాన్ని జప్తు చేయడంతో పాటు నిర్వాహకుడి లైసెన్స్ రద్దవుతుంది.
* వేడుకల్లో మద్యం సరఫరా చేసే నిర్వాహకులు.. కస్టమర్లు తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో క్యాబ్‌లు లేదా డ్రైవర్‌ల సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి.
* ఆ రోజు రోడ్లపై వాహనాలను రద్దీని తగ్గించుకునేందుకు ప్రజలు కార్‌పూలింగ్(నలుగురు కలిసి ఒకే కారులో ప్రయాణించడం)ను పాటించాలి.