న్యూఢిల్లీలోని దూరదర్శన్‌ భవనంలో అగ్నిప్రమాదం

 

 

fire accident
fire accident

న్యూఢిల్లీ: సెంట్రల్‌ న్యూఢిల్లీలోని దూరదర్శన్‌ భవనన్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈవిషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్లి మంటలు ఆర్పేశారు. మండి హౌస్‌ ప్రాంతంలోని దూరదర్శన్‌ భవన్‌లోని ఎయిర్‌-కండీషనింగ్‌ ప్లాంట్‌లో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. అక్కడి ప్రాంతమంతా పొగతో నిండిపోయింది. మంటలను పది నిమిషాల్లో నియంత్రించారని అగ్నిమాపక అధికారులు చెప్పారు. ఎవ్వరికి కూడా ప్రమాదం జరగలేదని వారు అన్నారు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.