న్యూజిలాండ్‌ 299 ఆలౌట్‌

sp2
Team India

న్యూజిలాండ్‌ 299 ఆలౌట్‌

ఇండోర్‌: టీమిండియాతో మూడవ టెస్టులో న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 299 పరుగు లకు ఆలౌటైంది.కాగా తొలి రెండు రోజుల్లో బ్యాటింగ్‌లో పూర్తి ఆధిపత్యం కనబరిచిన భారత్‌ ఆ తరువాత బౌలింగ్‌లో కూడా విజృంభించి న్యూజిలాండ్‌ను కుప్పకూల్చింది.కాగా భారత స్పిన్నర్‌ అశ్విన్‌ చెలరేగిపోవడంతో కివీస్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 299 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్‌ జిరో వికెట్లకు 28 పరుగులతో ఓవర్‌ నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ కొనసా గించగా గుప్టిల్‌ 72 పరుగులు, లాథమ్‌ 53 పరుగులు మంచి ఆరంభాన్నిచ్చారు.కాగా ఓవర్‌ నైట్‌ ఓపెనర్లు ఇద్దరు భారత్‌ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ 118 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.అయితే లాథమ్‌ తొలి వికెట్‌గా ఔటైన తరువాత కివీస్‌ పతనం ఆరంభమైంది.కేవలం 30 పరుగుల వ్యవధిలో మరో నాలుగు వికెట్లు నష్టపోవడంతో కివీస్‌ తేరుకోలేకపోయింది.కాగా లంచ్‌ విరామ సమయానికి 1 వికెట్‌కు 125 పరుగులతో ధీటుగా బదులిస్తున్నట్లు కనిపించిన కివీస్‌పై వరుసగా కీలక వికెట్లను చేజార్చుకుంది. న్యూజిలాండ్‌ ఆటగాళ్లలో లాథమ్‌,గుప్టిల్‌ తరు వాత నీషామ్‌ 71 హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకు న్నాడు. భారత బౌలర్లు అశ్విన్‌ ఆరు వికెట్లతో కివీస్‌ పతనాన్ని శాసించగా,జడేజాకు రెండు వికెట్లు లభించాయి. మరో రెండు వికెట్లు రనౌట్ల రూపంలో వచ్చాయి. దీంతో భారత్‌కు 258 పరుగులు ఆధిక్యం లభించింది.కివీస్‌ను పాలో ఆన్‌ ఆడించే అవకాశం ఉన్నా భారత్‌ తన రెండవ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. కాగా మురళీ విజ§్‌ు 11 పరుగులు, పుజారా 1 పరుగుతో బరిలో కొనసాగుతున్నారు. రికార్డుల టెస్టు మ్యాచ్‌ టీమిండియాతో జరుగుతున్న మూడవ టెస్టు రికార్డుల మ్యాచ్‌గా మారిపోయింది.కాగా తొలి రెండు రోజుల ఆటలో భారత క్రికెటర్‌ కోహ్లీ డబుల్‌ సెంచరీ చేసి ఆ ఘనతను రెండుసార్లు సాధించిన భారత కెప్టెన్‌గా సరికొత్త చరిత్రను లఃంచగా మూడవ రోజు ఆటలో అశ్విన్‌ ఏకంగా ఆరు వికెట్లు సాధించి మరో రికార్డును నెలకొ ల్పాడు. న్యూజిలాండ్‌పై టెస్టుల్లో అయిదుసార్లు అయిదు అంతకంటే ఎక్కువ వికెట్లను సాధించిన ఏకైక భారత బౌలర్‌గా అరుదైన మైలురాయిని నెలకొల్పాడు.అంతకు ముందు బేడి,సుభాష్‌ గుప్తే,ప్రసన్న,జహీర్‌ఖాన్‌లు నాలుగు సార్లు మాత్రమే న్యూజిలాండ్‌తో అయిదు వికెట్లను సాధించిన భారత బౌలర్లు.ఇదిలా ఉండగా అశ్విన్‌ ఆ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీయడంలో ఓవరాల్‌గా 20 సార్లు అయిదు వికెట్లకు పైగా సాధించిన ఘనత నమోదు చేశాడు.కాగా తన కెరీర్‌లో 39వ టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న అశ్విన్‌ కంటే ముందు ఇద్దరు మాత్రమే తక్కువ సమయంలో ఆ ఘనతను అందుకున్నారు.ఈ ఘనతను అతి తక్కువ టెస్టుల్లో ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్లు బార్నెస్‌ 25 టెస్టుల్లో,గ్రీమ్మెట్‌ 37 టెస్టుల్లో సాధించారు.కాగా ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ 299 పరుగులకు ఆలౌటైంది. టెస్టు ప్రారంభం నుంచి అదే దూకుడు న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరిదైన మూడవ టెస్టులో టీమిండియా దూకుడుగానే కనిపిస్తుంది.టెస్టు కెప్టెన్‌ కోహ్లీ తొలి రోజు 191 బంతులు ఆడి 10 బౌండరీలతో 103 పరుగుల అజేయ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.కాగా స్వదేశంలో 17 ఇన్నింగ్స్‌ల తరు వాత కోహ్లీ న్యూజిలాండ్‌తో సెంచరీ చేశాడు. చివరగా 2013 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాపై చెన్నై టెస్టులో సెంచరీ చేశాడు.మూడవ టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 3 వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేయగా, వరుసగా మూడవ టెస్టులోనూ టీమిండియానే పై చేయి సాధించింది.కాగా అజింక్యా రహానే 172 బంతులు ఆడి 9 బౌండరీలు,1 సిక్సర్‌తో 79 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లీ, అజింక్యా రహానే నాలుగవ వికెట్‌కు అబేద్యమైన 167 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా ఓపెనర్‌ మురళీ విజ§్‌ు 10 పరుగుల వద్ద త్వరగా వెనుదిరిగాడు.కాగా పుజారా 41 పరుగులతో మరోసారి సత్తా చాటాడు.అయితే స్పిన్నర్‌ శాంట్నర్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయి 100 పరుగుల వద్ద మూడవ వికెట్‌ రూపంలో నిష్క్రమించిన సంగతి తెలిసిందే.కాగా 37వ ఓవర్‌ నుంచి తొలి రోజు ఆట ముగిసే వరకు రహానే,కోహ్లీలు కివీస్‌ బౌలర్లకు మరో అవకాశం ఇవ్వలేదు.వీరి అజేయ భాగస్వామ్యంతో 167తో తొలిరోజు భారత్‌ పై చేయి సాధించింది.కివీస్‌ బౌలర్లలో పటేల్‌,బౌల్ట్‌, శాంట్నర్‌ ఒక్కొక్కరు ఒక వికెట్‌ తీసుకున్నారు. కాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడవ టెస్టు మ్యాచ్‌లో రెండవ రోజు భారత్‌ భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. కాగా కెప్టెన్‌ కోహ్లీ 271 బంతులు ఆడి 20 బౌండరీలతో 211 పరుగులు చేసి డబుల్‌ సెంచరీ సాధించాడు.అజింక్యా రహానే 254 బంతులు ఆడి 18 బౌండరీలు,4 సిక్సర్లతో 188 పరుగులు చేసి డబుల్‌ సెంచరీ మిస్‌ అయ్యాడు.కాగా 3 వికెట్లకు 267 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ కొనసా గించిన భారత్‌ లంచ్‌ సమయానికి 3 వికెట్లకు 358 పరుగులతో నిలిచింది.నాలుగవ వికెట్‌కు కోహ్లీ-రహానే జోడి 365 పరుగుల భాగ స్వామ్యాన్ని నెలకొల్పారు. కాగా భారత్‌ 5 వికెట్లు కోల్పోయి 557 పరుగులకు తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ ప్రకటించింది. కాగా మూడవ టెస్టులో కోహ్లీ డబుల్‌ సెంచరీ సాధించాడు.కాగా మొత్తం 347 బంతుల్లో కోహ్లీ 200 పరుగులు మైలు రాయిని అందుకున్నాడు. ఇప్పటికే వెస్టిండీస్‌పై కోహ్లీ ఒక డబుల్‌ సెంచరీ సాధించాడు.భారత్‌ టెస్టు కెప్టెన్‌ రెండు సెంచరీలు చేయడం చరిత్రలో తొలిసారి. భారత క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌గా ఉంటూ అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెటర్లలో ఇప్పటికే ధోనీని అధిగమించిన కోహ్లీ న్యూజి లాండ్‌ జట్టుపై తాజాగా సెంచరీతో టైగర్‌ పటౌడీని దాటేశాడు.టెస్టుల్లో అత్యధిక సంచరీలు చేసిన నాలుగవ ఆటగాడిగా ఉన్నాడు.కెప్టెన్‌గా ఆరు సెంచరీలు చేసిన కోహ్లీ కన్నా ముందు ముగ్గురు మాత్రమే ఉండగా వీరిని అధిగమించి తన పేరిట అరుదైన రికార్డు నెలకొల్పేందుకు కోహ్లీకి ఎక్కువ సమయం పట్టకపోవచ్చని క్రీడాపండితులు అంచానా వేస్తున్నారు. కాగా భారత జట్టు కెప్టెన్‌గా ఉండి సెంచరీలు సాధిం చిన వారిలో గవాస్కర్‌ 11 సెంచరీలతో అగ్రస్థా నంలో ఉండగా ఆపై అజారుద్దీన్‌ 9 సెంచరీలతో, సచిన్‌ 7 సెంచరీలతో ఉన్నారు. కోహ్లీ మరో అయిదు సెంచరీలు చేస్తే వీరందరి రికార్డులు పటాపంచలవుతాయి.