న్యూజిలాండ్‌ సరికొత్త రికార్డు

Kiwis
Kiwis

న్యూజిలాండ్‌ సరికొత్త రికార్డు

మౌంట్‌ మన్‌గాని: టి20 క్రికెట్‌లో న్యూజిలాండ్‌ జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది.మూడు టి20 సిరీస్‌లో భాగంగా మౌంట్‌ మౌన్‌గానిలో జరిగిన రెండవ మ్యాచ్‌లో కివీస్‌ ఆటగాడు కొలిన్‌ మున్రో 54 బంతులు ఆడి 7 బౌండరీలు,7 సిక్సుల సాయంతో 101పరుగులతో సెంచరీ సాధించాడు. తద్వారా టి20 చరిత్రలో అత్యధిక సెంచరీలు సా ధించిన జట్టుగానిలిచింది.ఈ సెంచరీతో న్యూజి లాండ్‌ జట్టు టి20ల్లో నాలుగు సెంచరీలు నమో దు చేసింది.అంతకు ముందు మూడు సెంచరీలు మాత్రమే వివిధజట్లు నమోదు చేశాయి. ఆస్ట్రే లియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, భారత జట్టు మూడు సెంచరీలు సాధించగా ఇప్పుడు దాన్ని న్యూజిలాండ్‌ అధిగమించింది.

న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ రెండు టి20 సెం చరీలు చేయగా,గుప్టిల్‌,మున్రోలు ఒక్కొక్కరు ఒక సెంచరీ చేశారు.కాగా బే పార్క్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో కొలిన్‌ మున్రో ఐదవ వికెట్‌కు 123 పరుగుల భాగ స్వామ్యాన్ని నెలకొల్పాడు.చివరలో 39 బంతులు లాడిన బ్రూన్‌ 59 పరుగులు చేసి జట్టువిజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో మూడు టి20 సిరీస్‌ను 2-0తో న్యూజిలాండ్‌ కైవసం చేసుకుంది.ఇంకో మ్యాచ్‌ మిగిలి ఉండగానే బంగ్లాదేశ్‌సిరీస్‌ను కోల్పోయింది.మొదట బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్‌ 18.1 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది.